రైల్వే ట్రాక్ పై వ్యక్తి..వెనుక రైలు, తర్వాత, వీడియో వైరల్

రైల్వే ట్రాక్ పై వ్యక్తి..వెనుక రైలు, తర్వాత, వీడియో వైరల్

Updated On : January 2, 2021 / 2:04 PM IST

A constable of Mumbai Police helped a 60-year-old man : చావు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. కానీ..కొంతమంది మృత్యుముఖంలోకి వెళ్లి సురక్షితంగా బయటపడుతారు. ఇంకా వీడికి భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని అంటుంటారు. ఇలాగే ఓ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి ఇరుక్కపోయాడు. వెనుక నుంచి రైలు వేగంగా వస్తోంది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అక్కడనే ఉన్న ఓ పోలీసు..సూచనలు చేశాడు. అమాంతం..ట్రాక్ పై నుంచి ప్లాట్ ఫాంపైకి రావడం..కానిస్టేబుల్ అమాంతం పైకి లాగడం జరిగిపోయాయి. ఈ దృశ్యాలన్నీ..సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబాయి దహిసార్ రైల్వే స్టేషన్. 60 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి..ప్లాట్ ఫాం నుంచి మరొక ప్లాట్ ఫాం వెళ్లేందుకు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో..అతని చెప్పు పట్టాలపై ఊడిపోయింది. చెప్పు తీసుకోవడానికి వెళ్లాడు. అదే సమయంలో రైలు వస్తోంది. ఇది గమనించిన..రైల్వే కానిస్టేబుల్ చూశాడు.

కింద పడుకోవాలని సూచించాడు. అతను చెప్పిన సూచలను పట్టించుకోకుండా..ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చాడు. పట్టాలపై నుంచి కానిస్టేబుల్ లాగిపడేశాడు. చిర్రెత్తుకొచ్చిన కానిస్టేబుల్ అతని తలపై ఒక్కటి వేశాడు. చాకచక్యంగా అతడిని కాపాడిన కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు అభినందించారు.