ఇంత ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నావ్ బాబాయ్? ఆటోవాలానా మజాకా..
ఆ ప్రయాణికుడు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడడం తప్పనిసరి అయిపోయింది. ఇంగ్లిష్ మీడియంలో చదుకున్నప్పటికీ చాలా మంది ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడలేక బాధపడిపోతుంటారు. సంవత్సరాల తరబడి నేర్చుకుంటున్నా తమకు ఇంగ్లిష్ భాష రావడం లేదని వాపోతుంటారు.
అటువంటిది మహారాష్ట్రలో ఓ ఆటోడ్రైవర్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అమరావతికి చెందిన ఆ ఆటోడ్రైవర్ తాజాగా ఓ ప్రయాణికుడితో ఇంగ్లిష్‌లో మాట్లాడాడు.
ఆ ప్రయాణికుడు ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆటోడ్రైవర్ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. ఇంగ్లిష్ నేర్చుకోవాలని కూడా ఆటోడ్రైవర్ సూచించాడని, ఆ భాషను నేర్చుకుంటేనే ప్రపంచంలో రాణించగలమని అతడు అన్నాడని తెలిపాడు.
ఇంగ్లిష్ వస్తే లండన్, ప్యారిస్, అమెరికా వంటి దేశాలు వెళ్లవచ్చని ఆటోడ్రైవర్ చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ భాష రాకపోతే అక్కడికి వెళ్లలేరని అన్నాడు. లండన్ వెళ్లి అక్కడి హోటల్‌లో వెయిటర్‌ని గ్లాస్ వాటర్ అని అడిగితే నీళ్లు ఇస్తాడని, అదే మరాఠీ భాషలో అడిగితే కస్టమర్ ని వెళ్లిపోవాలని చెబుతాడని తెలిపాడు. ఇంగ్లిష్ నేర్చుకోవాలని, ఇది ఇంటర్నేషనల్ భాష అని చెప్పాడు.
View this post on Instagram
Also Read : ఈ 4 అలవాట్లతో ఏకంగా 45 కిలోల బరువు తగ్గిన భారత సంతతి సీఈఓ.. పోస్టు వైరల్..!