Corona Effect : ఒక్క జిల్లాలోనే 8,000 మంది చిన్నారులకు కరోనా..ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

8000 Childrence Corona
Covid-19 for 8,000 children : కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్ని ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మొదటిసారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరిగింది. దీనికి తోడు ఆక్సిజన్ తీవ్ర కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఎంత తీవ్రంగా ఉంటే మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానాలు కూడా సరిపోనంతగా ఉంది.
సెకండ్ వేవ్ లో మతుల సంఖ్య పెరిగిందని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈ క్రమంలో థర్డ్ వేవ్ అంటేనే జనాలు హడలిపోతున్నారు. ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ లో చిన్నారులకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. మే రెండో వారంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని కొంతమంది నిపుణులు తెలిపారు. కానీ ఇప్పటికే భారత్ లో ఈ థర్డ్ వేవ్ ప్రారంభమైందా? అన్నట్లుగా ఉంది మహారాష్ట్రలో చిన్నారులకు సోకిన కరోనా కేసుల నమోదు చూస్తుంటే..
థర్డ్ వేవ్ లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలో కరోనా మొదటి వేవ్ నుంచి కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే మహరాష్ట్రలో ఈ థర్డ్ వేవ్ ప్రతాపాన్ని అప్పుడే చూపిస్తోందా?అనిపిస్తోంది. దీనికి నిదర్వనంగా మహారాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది.
ఒక్క మే నెలలలోనే 8 వేలమంది చిన్నారులు కరోనా బారిన పడినట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే అంశమని అహ్మద్ నగర్ జిల్లా చీఫ్ రాజేంద్ర భోసలే తెలిపారు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడిన చిన్నారులకు చికిత్సను అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సాంగ్లిలో ప్రత్యేకంగా పిల్లలకోసం కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. రెండవ వేవ్ సమయంలో..పడకలు,ఆక్సిజన్ కొరత ఉందనీ..థర్డ్ వేవ్ సమయంలో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరముందని ముందస్తుగా అన్ని సమకూర్చి పెట్టుకోవాలని ప్రజాప్రతినిథులు అంటున్నారు.
ఈ పరిస్థితుల గురించి మాట్లాడుతూ..”మే నెలలో 8వేల మంది చిన్నారులకు కరోనా సోకిందని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైరస్ సోకిన చిన్నారులకు చికిత్స అందేలా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమ్మద్ నగర్ జిల్లాకు చెందిన చిన్నపిల్లలో 10శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇది ఆందోళన కలిగించే విషయమని..అందుకే థర్డ్ వేవ్ నుంచి చిన్నారుల్ని సంరక్షించేందుకు చిన్నపిల్లల వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
కాగా మహారాష్ట్రలో లాక్ డౌన్ గురించి సీఎం థాక్రే మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసం ఉందని అందుకే జూన్ 15 వరకూ పొడిగించామని తెలిపారు. కరోనావైరస్ పరిస్థితిపై జిల్లా వారీగా సమీక్షలు జరుపుతున్నామని..కరోనా కేసులు పెరిగే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకంటున్నామని తెలిపారు.కేసులు పెరిగే ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షల్ని మరింతగా కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.