మహారాష్ట్రలో కూలిన భవనం..శిథిలాల కింద 50 మంది

మహారాష్ట్రలో రాయ్ గడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహద్ ప్రాంతంలో ఐదు అంతస్తుల గల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 17 మందిని కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ టీం ముంబై నుంచి ఘటనాస్థలికి బయలుదేరాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిన ఐదంతస్తుల భవనంలో 45 ప్లాట్లు ఉన్నట్లు సమాచారం.
సోమవారం వర్కింగ్ డే కాబట్టి ప్లాట్లలలో తక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోందని, 40 నుంచి 45 మంది దాక ఉన్నట్లు భావిస్తున్నామని, రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి వెల్లడించారు. అయితే..ఎమ్మెల్యే చెప్పిన భిన్నంగా వ్యాఖ్యానించారు.
కూలిన భవనంలో 100 మంది దాక చిక్కుకపోవచ్చని మహద్ ఎమ్మెల్యే వెల్లడించారు. వారు ఏ స్థితిలో ఉన్నారో చెప్పడం కష్టమౌతోందని, వారి బంధువులతో మాట్లాడుతున్నామన్నారు. సీఎంతో తనతో మాట్లాడారని తెలిపారు.
అయితే..భవనం ఎలా కూలిపోయిందనేది తెలియరావడం లేదు. పూర్తి వివరాాలు తెలవాల్సి ఉంది.