బస్సులో చార్జింగ్ పోర్ట్ లేదు.. ఏసీ వెయ్యలేదు: ఆర్టీసీకి ఫైన్ వేసిన వినియోగదారుల హక్కుల ఫోరమ్

  • Published By: vamsi ,Published On : December 4, 2019 / 04:08 AM IST
బస్సులో చార్జింగ్ పోర్ట్ లేదు.. ఏసీ వెయ్యలేదు: ఆర్టీసీకి ఫైన్ వేసిన వినియోగదారుల హక్కుల ఫోరమ్

Updated On : December 4, 2019 / 4:08 AM IST

యాడ్స్​లో చూపిన విధంగా బస్సులో ఎయిర్​కండిషనింగ్, మొబైల్​ చార్జింగ్​ పాయింట్​లేకపోవడంతో పాసింజర్​కు రూ.5 వేల ఫైన్‌‌ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది వినియోగదారుల హక్కుల ఫోరమ్. వివరాల్లోకి వెళ్తే సతీష్​రతన్​లాల్​ అనే వ్యక్తి దయామా తన ఫ్రెండ్​తో కలిసి శివ్​షాహి బస్​లో జల్నా నుంచి ఔరంగాబాద్​కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్​ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్​ పాయింట్​ కోసం అడిగాడు.

అయితే బస్సులో ఏసీ, చార్జింగ్​ పాయింట్​ పని చేయడం లేదని సదరు బస్సు నిర్వాహకులు చెప్పారు. దీంతో కంప్లయింట్​ రిజిస్టర్​ను ఇవ్వాలని బస్​ డ్రైవర్, కండక్టర్​ను అడిగితే ఇవ్వలేదు. దీంతో జిల్లా వినియోగదారుల హక్కుల​ ఫోరమ్‌లో కంప్లయింట్​ చేశాడు సతీష్​రతన్​లాల్​ దయామా.

ఏసీ, చార్జింగ్​ పాయింట్​ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్​ టెన్షన్​ అనుభవించానంటూ ఫిర్యాదులో వెల్లగించాడు సతీష్​రతన్​లాల్​. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్​లో ఏసీ, మొబైల్​ చార్జింగ్​పోర్ట్​ గురించి ప్రచారం చేశాయని, టికెట్​ల రేట్లను కూడా అందుకు తగ్గట్టే నిర్ణయించి చార్జ్​ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవంటూ ఫోరమ్‌కు తెలిపాడు.

వాదనలు విన్న వినియోగదారుల హక్కుల కోర్టు.. 30 రోజుల్లో సతీష్​కు రూ.5 వేలు పరిహారం కింద చెల్లించాలంటూ మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది. కస్టమర్ మానసిక వేదనకు కారణం అయిన మహారాష్ట్ర ఆర్టీసీ పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.