Sanjay Raut: ఆయన శకం ముగిసింది.. ఏక్‌నాథ్ షిండేపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే కొనసాగుతున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తరువాత నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర పఢ్నవీస్ కొనసాగనున్నారు.

Sanjay Raut Eknath Shinde
Eknath Shinde: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండే శకం ముగిసిందని, ఆయన రాజకీయ భవిష్యత్తు రాబోయే కాలంలో ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే కొనసాగుతున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తరువాత నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర పఢ్నవీస్ కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నిల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి నిన్నటి వరకు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై స్పెన్షన్ కొనసాగుతూనే వచ్చింది. చివరి వరకు సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే బీజేపీ వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. అయితే, అందుకు బీజేపీ అధిష్టానం ససేమీరా అనడంతో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు షిండే సిద్ధమయ్యారని తెలిసింది. ఈ క్రమంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏక్ నాథ్ షిండేను బీజేపీ ఇన్నిరోజులు ఉపయోగించుకుందని, ఇప్పుడు ఆయన అవసరం తీరిన తరువాత పక్కన పెట్టేందుకు సిద్ధమైందని సంజయ్ రౌత్ అన్నారు. ఇక షిండే శకం ముసిగిందని, ఆయన మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని, ఆయన అవసరం కూడా బీజేపీకి లేదని రౌత్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా షిండే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా షిండే పార్టీని కూడా బీజేపీ విచ్చిన్నం చేయగలదని, ఇది ప్రధాని మోదీ రాజకీయ పంథా అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహాయతి కూటమిలో అంతర్గతంగా వర్గవిబేధాలు తారాస్థాయిలో ఉన్నాయని, ఇవాళకపోయినా తర్వాతైనా కూటమిలో వర్గవిబేధాలు బయటపడతాయని, ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.