kerala congress women : టికెట్ లభించలేదని గుండు కొట్టించుకున్న మహిళ కాంగ్రెస్ నేత

కేరళలో ఆ పార్టీని షాక్‌కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు.

kerala congress women : టికెట్ లభించలేదని గుండు కొట్టించుకున్న మహిళ కాంగ్రెస్ నేత

Kerala Congress Women

Updated On : March 15, 2021 / 2:40 PM IST

Mahila Congress Chief : కేరళలో ఆ పార్టీని షాక్‌కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు. ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకున్నారు. ఎత్తుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలనుకున్నారు. అయితే లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆమె ఆగ్రహించి పార్టీ కార్యాలయం ముందే గుండు కొట్టిచ్చుకున్నారు.

కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఢిల్లీలో ఈ జాబితాను రిలీజ్ చేస్తూ మహిళా అభ్యర్థులు తగినంతమంది లేరని చెప్పారు. దీంతో ఆ మహిళా నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై నిప్పులు చెరగడమే కాకుండా.. రాజీనామా చేసి.. శిరోముండనం చేసుకున్నారు. ఆమె ప్రవర్తనకు కాంగ్రెస్‌ నేతలు ఖంగుతిన్నారు.

టిఇది ఇలా ఉండగా మాజీ సీఎం ఊమెన్ చాందీ… అసెంబ్లీలో విపక్ష నేత రమేష్ చెన్నితాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఊమెన్ చాందీ పుత్తుపల్లి నుంచి, రమేష్ చెన్నితాల హరిపాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నటుడు ధర్మాజన్ కోజీకోడ్ జిల్లా బలుసారి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇటు టికెట్ల పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇద్దరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. కేరళ కాంగ్రెస్‌లో ముఠా రాజకీయాలు పెరిగిపోయాయని నిరసన వ్యక్తం చేశారు సీనియర్ నేతలు పీసీ చాకో, విజయన్ థామస్.