పారగాన్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్ లో బుదవారం ఉదయం (ఫిబ్రవరి 20,2019)న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనమంతా మంటలంటుకున్నాయి.
దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను ఖాళీ చేయించారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న మెట్రో పని కూడా ఆగిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.