Bengaluru traffic: పుష్ప మీదే జోకులా? బెంగళూరు ట్రాఫిక్‌పై పగలబడి నవ్వుకునేలా మీమ్స్

బెంగళూరు ట్రాఫిక్ నుంచి పుష్ప సైతం తప్పించుకోలేడు.. ఎంత పెద్ద దొంగ అయినా ఇందులో ఇరుక్కోవాల్సిందే.. పోలీసులకు చిక్కాల్సిందే..

Bengaluru traffic: పుష్ప మీదే జోకులా? బెంగళూరు ట్రాఫిక్‌పై పగలబడి నవ్వుకునేలా మీమ్స్

Bengaluru Outer Ring Road triggers memes

Updated On : September 28, 2023 / 5:09 PM IST

Memes: బెంగళూరులో బుధవారం (సెప్టెంబరు 27) సిటీ టెక్ హబ్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణం చేసిన వారు నరకం అనుభవించారు. కొన్ని గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. నత్తనడకన ముందుకు సాగాయి. తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలపై నిరసన వ్యక్తం చేస్తూ రైతులతో పాటు కన్నడ సంఘాల ఐక్యవేదిక ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ బెంగళూరులో బంద్‌ నిర్వహించింది.

అలాగే, వరుసగా సెలవులు రావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లాలనుకున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ ఏర్పడడంతో లక్షలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. ఓఆర్ఆర్, మారతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డ్ మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనపడ్డాయి.

దీంతో సామాజిక మాధ్యమాల్లో వాహనదారులు తమ బాధను చెప్పుకున్నారు. ఇక మీమర్స్ తమలోని క్రియేటివిటీని మరోసారి బయటకు తీసి మీమ్స్ సృష్టించారు. కడుపుబ్బా నవ్విస్తూనే ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు, ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్నప్పుడు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఐటీ ఉద్యోగులు అనుభవించిన బాధను వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశారు.

ఎర్రచందనం దుంగలతో పుష్ప పారిపోతున్నాడని పోలీసులు అన్నట్లు, ట్రాఫిక్‌లో పట్టుకోవచ్చులే అని వారి అధికారి అన్నట్లు మీమర్స్ మీమ్స్ సృష్టించారు. ఈ ట్రాఫిక్ నుంచి పుష్ప కూడా తప్పించుకోలేడు.. పుష్ప ఇక తగ్గాల్సిందే అంటూ మరికొందరు మీమ్స్ వదిలారు. ఇటువంటి మీమ్స్ మీరూ చూసి కడుపుబ్బా నవ్వుకోండి..


Bengaluru traffic


Bengaluru traffic

Ring Road triggers memes reactions

 

Farmers Protest : చచ్చిన ఎలుకల్ని నోట్లో పెట్టుకుని అర్థనగ్నంగా రైతుల నిరసన