చైనీస్ లో దీదీ ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 10:30 AM IST
చైనీస్ లో దీదీ ఎన్నికల ప్రచారం

Updated On : April 3, 2019 / 10:30 AM IST

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొత్త దారిలో దూసుకుపోతున్నారు. కోల్‌కతాలో స్థిరపడిన చైనీయులను ఆకర్షించేందుకు చైనీస్‌లోనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించాలనే ప్రధాన సంకల్పంతో దీదీ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో దక్షిణ కోల్‌కతా లోక్‌సభ నియోజకవర్గంలో  2,000 మందికి పైగా ఉండే  చైనీయులకు పశ్చిమ బెంగాల్ లో ఓటు హక్కు ఉంది. దీంతో టీఎంసీ చైనీయులను ఆకర్షించేందుకు.. చైనా భాషలోనే ప్రకటనలు రాయిస్తున్నారు. కరపత్రాలను ప్రింట్ చేయించి పంచుతున్నారు. కాగా ఇక్కడ స్థిరపడిన చైనీయులందరికీ బెంగాలీ, హిందీ మాట్లాడటం వచ్చు. అయినప్పటికీ టీఎంసీ ముందు జాగ్రత్తగా పోస్టర్లను చైనీస్‌లో ప్రింట్ చేయించారు. 

కాగా ఈ ఎప్పుడు లేని విధంగా ఈ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాలను నిర్వహిస్తున్నాయి ఆయా రాష్ట్రాలలోను పార్టీ అధినేతలు. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందకు సరికొత్త పంథాలను అవలంభిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమిని కూడగట్టటంలో పలు పార్టీల అధినేతలు సమావేశమవ్వటం..పలు సందర్భాలలో చర్చలు కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే. మరి వారి లక్ష్యం నెరవేరుతుందో లేదో రానున్న ఫలితాలు నిర్ణయించనున్నాయి.