Bharat Ratna: అమితాబ్ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలి… మమతా బెనర్జీ వ్యక్తిగత డిమాండ్
ఆమె మాట్లాడుతూ ‘‘బెంగాల్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మానవత్వంలోనైనా, పోరాటంలోనైనా ముందుంటుంది. భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి పోవడంలోనైనా, విధ్వేష శక్తులతో పోరాడటంలోనైనా బెంగాలీలు ముందుంటారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు. ఎవరినీ భిక్ష అడగదు. ఎప్పుడూ తలెత్తుకొని ఉంటుంది’’ అని అన్నారు.

Mamata Banerjee demands Bharat Ratna for Amitabh Bacchan
Bharat Ratna: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. 28వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రభుత్వం తరపున చేస్తున్న డిమాండ్ కాదని, సినిమా రంగంలో అమితాబ్ చేసిన కృషిని గుర్తిస్తూ వ్యక్తిగతంగా తాను చేస్తున్న డిమాండ్ అని మమత స్పష్టం చేశారు.
Viral Tweet: హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు.. తండ్రికి పంపిన మెనూ లిస్ట్ చూస్తే షాకవ్వడం ఖాయం
‘‘ఇదేమీ బెంగాల్ తరపున అధికారికంగా కాదు. కానీ, నా వ్యక్తిగతమైన అభిలాష. నా వ్యక్తిగతమైన డిమాండ్. సినిమా రంగంలో సుదీర్ఘ సమయం వెలుగొందిన, సినిమా రంగానికి ఎంతగానో కృషి చేసిన అమితాబ్ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలనేది నా డిమాండ్’’ అని మమతా బెనర్జీ అన్నారు. 28వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ బచ్చన్ సహా మరొక బాలీవుడ్ ప్రముఖుడు షారూఖ్ ఖాన్ ముఖ్య అతిథితులుగా వచ్చారు.
Himachal Pradesh: కేబినెట్ విస్తరణపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘బెంగాల్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మానవత్వంలోనైనా, పోరాటంలోనైనా ముందుంటుంది. భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి పోవడంలోనైనా, విధ్వేష శక్తులతో పోరాడటంలోనైనా బెంగాలీలు ముందుంటారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు. ఎవరినీ భిక్ష అడగదు. ఎప్పుడూ తలెత్తుకొని ఉంటుంది’’ అని అన్నారు. మమతా బెనర్జీ అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమితాబ్, షారూఖ్ ప్రసంగించారు.