జర్నలిస్ట్ లకు కూడా 10లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించిన మమతా

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 10:28 AM IST
జర్నలిస్ట్ లకు కూడా 10లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించిన మమతా

Updated On : May 3, 2020 / 10:28 AM IST

కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వారికి 10లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇవ్వనున్నట్లు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. కరోనా పోరాటంలో ప్రాణాలుకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లతో సహా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల బీమాను వర్తింపచేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. 

ఇవాళ ప్రెస్ ఫ్రీడం డే సందర్భంగా..కరోనాపై ముందుండి పోరాడే వారితో పాటు జర్నలిస్టులకూ బీమా సౌకర్యం వర్తింప చేస్తామని ఆమె ఓ ట్వీట్ లో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ పిల్లర్ అని, మీడియా స్వతంత్రంగా నిర్భయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మమత తెలిపారు.

సమాజానికి జర్నలిస్ట్ లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. కాగా,ఇప్పటివరకు వెస్ట్ బెంగాల్ లో 992 కరోనా కేసులు నమోదుకాగా,33మరణాలు నమోదైనట్లు కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.