West Bengal Election Result ఇది బెంగాల్ విజయం..విజయోత్సవాలు వద్దు…వీల్ చైర్ వదిలేసిన Mamata Banerjee

Mamata
MAMATA టీఎంసీ ఘనవిజయం నేపథ్యంలో ఇది బెంగాల్ విజయమని మమతా బెనర్జీ తెలిపారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన మమతాబెనర్జీ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోవాలని టీఎంసీ కార్యకర్తలను మమత కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ణప్తి చేశారు. ఇక,నందిగ్రామ్ ఎన్నికల ప్రచార సమయంలో కాలిగా గాయమడంతో ..అప్పటినుంచి వీల్ చైర్ లో ఉండే ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమతాబెనర్జీ నేడు వీల్ చైర్ ను వదిలేసి నడిచారు.
మరోవైపు,ఉత్కరంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నికలో మమత బీజేపీ అభ్యర్థి సువెందుపై మమతాబెనర్జీ ఓటమి పాలయ్యారు. 1957ఓట్ల మెజార్టీతో మమతపై బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి విజయం సాధించారు.
కాగా,బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 216స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉండగా..కేవలం 75స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక,కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అడ్రస్ గల్లంతైపోయింది. బెంగాల్ లో ఘన విజయం సాధించిన టీఎంసీకి అభినందనలు తెలిపారు కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్.