Haridwar : తల్లిని, గంగాజలాన్ని కావడిపై మోస్తూ హరిద్వార్‌లో కనిపించిన వ్యక్తి వీడియో వైరల్
హరిద్వార్‌లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Haridwar
Haridwar : హరిద్వార్‌లో కన్వర్ యాత్ర ప్రారంభమైంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. జూలై 4 నుంచి జూలై 15 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ఓ వ్యక్తి కావడిలో ఓ వైపు తల్లిని, మరోవైపు గంగాజలాన్ని మోసుకుని వెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Wrestlers Protest : హరిద్వార్‌లో రెజ్లర్ల తీవ్ర భావోద్వేగం..
ప్రతి సంవత్సరం శివుని భక్తులు కన్వర్ యాత్ర పేరుతో యాత్రను చేస్తారు. ఇది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు గంగానది నుండి పవిత్ర జలాన్ని సేకరించి ఆ జలాన్ని తమ రాష్ట్రాల్లోని శివాలయాలకు తీసుకెళ్తారు. యాత్ర మధ్యలో ఉత్తరాఖండ్‌లోని గౌముఖ్ ,గంగోత్రి .. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు.ఈ యాత్రలో మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కాలికి చెప్పులు సైతం ధరించకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొంటారు.
Jio True 5G Services : హరిద్వార్‌లో జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా 226 నగరాల్లో అందుబాటులోకి..!
అయితే ఈసారి యాత్రలో ఓ భక్తుడు కావడిపై ఒకవైపు నీటితో పాటు మరోవైపు తన తల్లిని కూర్చోబెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చాలామంది ‘హర హర మహాదేవ్’ అని కామెంట్ పెట్టి నమస్కరిస్తున్న ఎమోజీని జోడించారు. తల్లి, గంగాజలం రెంటినీ మోస్తున్న అతను ఎంతో పుణ్యం చేస్తున్నాడు అంటూ అభిప్రాయపడ్డారు.
Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023