Odisha : కాలుతున్న భార్య చితిలో దూకిన భర్త
భార్య కాలుతున్న చితిలోనే అమాంతం దూకేశాడు. చితిలో భార్య భర్తలు కాలిపోయారు. మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య, భర్తలను చూసి అక్కడున్న వారు చలించిపోయారు.

Life
Wife’s Funeral Pyre : భార్య..ఇక లేదనే నిజాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్య ఇక తనతో ఉండదనే బాధ దిగమింగులేక పోయాడు. చనిపోయినప్పటి నుంచి శ్మశానం చేరే దాక భార్య జ్ఞాపకాలే అతని ముందు మెదలుతున్నాయి. భార్య లేకుండా తాను ఎందుకు బతకాలి ? అని అనుకున్నాడు. అంతే…భార్య కాలుతున్న చితిలోనే అమాంతం దూకేశాడు. ఒకే చితిలో భార్య భర్తలు కాలిపోయారు. మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య, భర్తలను చూసి అక్కడున్న వారు చలించిపోయారు. ఈ ఘటన ఒడిశ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read More : Water of 115 Nations: అయోధ్య రామాలయం కోసం 115 దేశాల నీరు
కలహండి జిల్లాలోని గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో…రాయబారి (60), నీలమణి శబర (65) భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. కష్టాలు, సుఖాలు పాలుపంచుకుంటూ వీరు జీవించే వారు. అయితే..రాయబారి అకస్మాత్తుగా మంగళవారం గుండెపోటుతో చనిపోయింది. దీనితో భర్త శబర కన్నీరుమున్నీరుగా విలపించాడు. గుండెలలిసెలా రోదించాడు. నలుగురు కుమారులు, బంధువులు, కుటుంబసభ్యులు ఓదార్చారు. చివరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ శివారులో ఉన్న శ్మశానస్థలానికి అందరూ బయలుదేరారు.
Read More : Krishna River Water : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం
అక్కడ చితి పేర్చి…మృతదేహానికి నిప్పంటించారు. అప్పటిదాక తనతో కష్టాలు, సుఖాలు పంచుకున్న భార్య…ఇక తిరిగిరాదని కుమిలిపోయాడు. కొద్దిసేపటి అనంతరం అందరూ ఇంటికి బయలుదేరారు. వీరితో పాటు..శబరి కూడా వస్తున్నాడు. ఒక్కసారిగా ఏమైందో..ఏమో…శబరి పరుగు పరుగున వెళ్లి..కాలుతున్న భార్య చితిలో అమాంతం దూకేశాడు. అక్కడున్న వారు కాపాడేందుకు ప్రయత్నించినా..అప్పటికే ఆలస్యం అయిపోయింది. భార్య, భర్తలు చితిలో కాలిపోయారు. అక్కడున్న వారి హృదయాలను కదిలించివేసింది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.