Snake Save : ‘ఊపిరి’ ఊది పాముకు ప్రాణం పోసిన యువకుడు
ఓ యువకుడు ప్రాణాపాయంలో ఉన్న ఓ పాముకు నోట్లో నోరు పెట్టి ఊరిపి ఊది ప్రాణం పోసాడు. ఒడిశాలో మల్కన్‌గిరి జిల్లాలో ఊపిరి అందక బాధపడుతున్న పాము నోరు తెరిచి ఊపిరి ఊది ప్రాణం పోసాడు.

Snake Save
man who saved the snake’s life : ఊపిరి అందక..ఎవరైనా ప్రాణాపాయంలో పడితే నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తే బతుకుతారు. కానీ ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న ఓ పాముకు నోట్లో నోరు పెట్టి ఊరిపి ఊది దానికి ప్రాణం పోసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒడిశాలో మల్కన్‌గిరి జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. తన దారిన తాను వెళ్తున్న ఓ యువకుడికి దారి వెంట అపస్మారక స్థితిలో ఒక పాము కనిపించింది. ఆ పాముకు శ్వాస అందక విలవిల్లాడుతోందని గుర్తించాడు. అది పాము అనీ కరిస్తే చనిపోతానని అతను అనుకోలేదు. దాన్ని బ్రతకించాలనుకున్నాడు. ఊపిరి ఊదితే బ్రతుకుతుందనుకున్నాడు.
దానికి ఏం చేయాలా? అని ఆలోచించి అటూ ఇటూ చూశాడు. ఓ స్ట్రా కనిపించింది. ఆ స్ట్రా తీసుకుని పాముని పట్టుకుని నోరు విప్పి దాని నోట్లోకి స్ట్రా పెట్టి ఊపిరి ఊదాడు. అది చూసిన స్థానికులు షాక్ అయ్యారు..ఓయ్ ఛస్తావ్..ఏంటా పనులు అంటూ వారించారు. కానీ అతను వినలేదు. పాపం అంటూ మళ్లీ మళ్లీ ఊదాడు. కానీ పాములో ఎక్కడా చలనం లేదు. అలా పదే పదే ఊదుతూనే ఉన్నాడు. అలా దాదాపు 15 నిమిషాలు ఊదటం చేస్తునే ఉన్నాడు. ఆ తరువాత ఎట్టకేలకూ ఆ పాములో కదలికలు వచ్చాయి. స్పృహలోకి వచ్చింది.
అది చూసిన స్థానికులు యువకుడి సాహసానికి మంచి తనానికి అభినందించారు. పాముకు ప్రాణాపాయం తప్పినందుకు ఆ యువకుడు కూడా సంతోషపడ్డాడు. పాముకు ఊపిరి ఊదుతున్న దృశ్యాలకు అక్కడున్న కొంతమంది వీడియోలు..ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. ఊపిరి అందాక కోలుకున్న పాముని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ పాము ఓ ఎలుకను పట్టుకని తినటానికి ఎలుకను వెంబడించి ఓ కన్నంలో ఇరుక్కుపోయిందని అలా దానికి శ్వాస ఆడక ఇబ్బంది పడిందని దాన్ని చూసిన ఓ యువకుడు పాము నోట్లో స్ట్రా పెట్టి ఊపిరి అందించి బ్రతికించాడని స్థానిక మీడియా వెల్లడించింది.