Police Constable: ఫుల్లు తాగి పోలీసును చితకబాదిన మందుబాబు
ఫుల్లుగా మద్యం తీసుకుని పోలీసునే చితకబాదాడో వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రదేశంలో పోలీసును కొడుతున్న వీడియో శనివారం వైరల్ కావడంతో అధి

Police Constable
Police Constable: ఫుల్లుగా మద్యం తీసుకుని పోలీసునే చితకబాదాడో వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రదేశంలో పోలీసును కొడుతున్న వీడియో శనివారం వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.
ఏరోడ్రామ్ పో్లీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ శుక్లా.. కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం వెంకటేశ్ నగర్ ఏరియాలో ఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ జైప్రకాశ్ జైస్వాల్ లంచ్ చేయడానికి ఇంటికి వెళ్తున్నాడు. మార్గంలో పోతున్న వ్యక్తికి జైశ్వాల్ బైక్ టచ్ అయింది. దాంతో వాదన మొదలైంది.
అలా పెరిగిన వాదనలో కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీని తీసుకున్న అవతలి వ్యక్తి కొట్టడం మొదలుపెట్టాడు. తప్పించుకునే క్రమంలో పారిపోతున్నా వెంబడించి కొట్టాడు. పలు గాయాలపాలైన జైస్వాల్ ఏరోడ్రామ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు.
Read Also : పీఎస్ లోనే హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన యువతి..
కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని శుక్లా అన్నారు. సెక్షన్ 307 ప్రకారం.. హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేసి నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.