woman beats police : పీఎస్ లోనే హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన యువతి..

ఓ యువతి ఏకంగా ఓ పోలీసునే కొట్టింది. అదీ పోలీస్ స్టేషన్ లో. తన సోదరుడి కోసం పోలీస్ స్టేషన్ కువెళ్లిన ఓ యువతి ఆ స్టేషన్ డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదింది. పోలీస్ స్టేషన్ లోంచి ఓ ఆడగొంతు కేకలు పెడుతుంటే అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ కేకలు ఓ పోలీస్ కానిస్టేబుల్ వనీ కొట్టేది ఓ సాధారణ యువతి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

woman beats police : పీఎస్ లోనే హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన యువతి..

Woman Beats Up Women Head Constable In Hardoi Police Town Station

Updated On : August 5, 2021 / 2:47 PM IST

woman beats up constable in Hardoi police station : ఓ యువతి ఏకంగా ఓ పోలీసునే కొట్టింది. అదీ పోలీస్ స్టేషన్ లో. ఇది వినటానికి కాస్త షాకింగ్ గానే ఉన్నా నిజం. పోలీస్ స్టేషన్ కువెళ్లిన ఓ యువతి ఆ స్టేషన్ లో మహిళా హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదింది. పోలీస్ స్టేషన్ లోంచి ఓ ఆడగొంతు కేకలు పెడుతుంటే అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ కేకలు ఓ పోలీస్ కానిస్టేబుల్ వనీ కొట్టేది ఓ సాధారణ యువతి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి జిల్లాలోని హర్దోయీ పట్టణంలో జరిగింది.

సదరు మహిళా కానిస్టేబుల్ గొంతు గుర్తు పట్టి స్టేషన్ లోనే ఉన్న మిగతా పోలీసు సిబ్బంది పరుగు పరుగున వచ్చి చూసేసరికి ఇంకేముంది ఓ యువతి తమ కానిస్టేబుల్‌ను చావబాదుతు కనిపించింది.దీంతో వెంటనే పోలీసులు తమ కానిస్టేబుల్ ను ఆ యువతినుంచి విడిపించి కాపాడుకోవాల్సి వచ్చింది.

ఈ వింత ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..కాన్హా ద్వివేది అనే యువకుడు ఓ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. విచారణ కోసం పోలీసులు ద్వివేదిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో ఓ యువతి ఆ పోలిస్ స్టేషన్ కు వచ్చింది. ఆమె ద్వివేది సోదరి నిధి. మధ్యాహ్నం 12గంటల సమయంలో నిథి స్టేషన్ లోకి ఎంట్రీ ఇవ్వటమే తిట్లతో దూసుకొచ్చింది. రావడం రావడమే పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టిపోయడం మొదలుపెట్టింది.

అదే సమయంలో స్టేషన్ డ్యూటీలో ఉన్న శీలూ అనే మహిళా కానిస్టేబుల్ ..పోలీసులను నోటికొచ్చినట్లుగా పచ్చిబూతులు తిడుతున్న నిధిని అడ్డుకుంది. ఏంటా తిట్లు నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతావా? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? ముందు చెప్పు అంటూ ప్రశ్నించింది. అంతే నిధి కోపం కట్టలు తెంచుకుంది. ఇతను నా సోదరుడి ద్వివేది. అతన్ని ఎందుకు పిలిపించారు స్టేషన్ కు అంటూ హెడ్ కానిస్టేబలు శీలూపై విరుచుకుపడింది. దానికి శీలూ ఏదో చెప్పబోయింది.

అక్కడితో ఆగకుండా పోలీసు అని కూడా చూడకుండా లెక్కచేయకుండా హెడ్ కానిస్టేబుల్ శీలూపైకి దూకి ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం మొదలుపెట్టింది. ఏకంగా కానిస్టేబుల్ చెయ్యి మెలితిప్పి కొట్టడంతో.. శీలూ చేతిలోని ఘన్ కూడా కింద పడిపోయింది. నిధి నుంచి తప్పించుకోవటం ఆమె వల్ల కాలేదు. దాంతో శీలూ పెద్దగా అరిచి కేకలు పెట్టడంతో పోలీసు స్టేషన్‌లోని మరికొందరు కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని శీలూను కాపాడారు. ఆ తరువాత పోలిస్ స్టేషన్ కొచ్చి పోలీసునే కొడతావా? అంటూ నిధి మీద కేసు నమోదు చేసారు.