తుపాకులు పట్టుకుని డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 06:38 AM IST
తుపాకులు పట్టుకుని డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Updated On : October 17, 2019 / 6:38 AM IST

డెహ్రాడూన్‌ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ బాగా తాగి.. ఆ మత్తులో తుపాకులతో డ్యాన్స్ చేస్తూ మీడియాకు చిక్కారు.

వివరాలు.. 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి  తన ఇంట్లో రెండు చేతుల్లో రెండు తుపాకులను పట్టుకుని వీడియో తీసుకుంటూ హిందీ పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడమే కాకుండా.. ఉత్తరాఖండ్‌ పోలీసుల దాకా చేరింది. అనంతరం ఉత్తరాఖండ్‌ పోలీసులు ఈ డ్యాన్స్‌ వీడియో పై   స్పందించారు. 

సర్కిల్‌ ఆఫీసర్‌ అభయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ వీడియో హరిద్వార్‌ నుంచి వచ్చిందా? లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.