Gunshot Wound: బులెట్ గాయాన్ని పిల్లి గోకిందనుకుని మర్చిపోయి నిద్రపోయాడు!!

పిల్లి గీకిన దానికి బుల్లెట్ గాయానికి తేడా తెలుసుకోలేకపోయాడా వ్యక్తి. పాపం స్కానింగ్ చేయించుకుంటేనే గానీ తెలియలేదు.

Gunshot Wound: బులెట్ గాయాన్ని పిల్లి గోకిందనుకుని మర్చిపోయి నిద్రపోయాడు!!

Bullet Fire

Updated On : September 27, 2021 / 10:08 PM IST

Gunshot Wound: పిల్లి గీకిన దానికి బుల్లెట్ గాయానికి తేడా తెలుసుకోలేకపోయాడా వ్యక్తి. పాపం స్కానింగ్ చేయించుకుంటేనే గానీ తెలియలేదు రిబ్స్ లో బుల్లెట్ గాయం అయిందని… పైగా అక్కడి నుంచి బుల్లెట్ కూడా బయటకు తీశారు.

బుల్లెట్ ఫైర్ అవగానే శరీరంలో నుంచి కాస్త రక్తం..విపరీతమైన నొప్పితో విలవిలలాడటం ఖాయం. కానీ, ఈ వ్యక్తి వేరే రకం గాయమైంది. నేమీచంద్ అనే వ్యక్తికి ఇలా జరిగింది. తనకు కిడ్నీలో సమస్యగా ఉందని నిద్రపట్టకపోవడంతో పిల్లి గీకిందేమోనని అనుకున్నాడు.

సెప్టెంబర్ 16వ తేదీ దాదాపు 7గంటల పాటు బాధ అనుభవించి ఆ తర్వాత మరిచిపోయి నిద్రపోయాడు. తనతో పాటు రూంలో ఉన్న ముగ్గురిలో ఒకరు ఖాళీ బులెట్ పడి ఉండటాన్ని గమనించాడు. ఆ నొప్పి పిల్లి గోకినది కాదని అనుమానించాడు. వెంటనే మెడికల్ టెస్టులకు వెళ్లడంతో అసలు విషయం బయటికొచ్చింది.

…………………………………….: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్

ఎక్స్ రేలో ఐదు సెంటీమీటర్ల పొడవున్నబుల్లెట్ కనిపించింది. దానిని ఒక రోజు తర్వాత సిజేరియన్ చేసి తీసేశారు. ఈ ఘటనను హత్యాయత్నం కింద పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు సర్జరీలు చేసి బుల్లెట్ తీసి ఇన్ఫెక్షన్లుకాకుండా ట్రీట్మెంట్ ఇచ్చారు. కొద్ది రోజుల్లో ఆవ్యక్తి పూర్తిగా రికవరీ అవుతాడని వైద్యులు చెబుతున్నారు.