Manipur : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత…భద్రతా బలగాలు, సాయుధుల మధ్య కాల్పులు
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి....

Manipur tense again
Manipur : మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. (Manipur tense again as fresh gunfight) ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
Bypoll Results 2023 : త్రిపురలో బీజేపీ, ఘోసీలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ముందంజ
బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్‌చావో ఇఖాయ్‌లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడి, టోర్‌బంగ్‌లోని వారి నిర్జన గృహాలకు చేరుకునే ప్రయత్నంలో ఆర్మీ బారికేడ్‌లను ఛేదించడానికి ప్రయత్నించారు. దీంతో శుక్రవారం కాల్పుల సంఘటన జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), అస్సాం రైఫిల్స్,మణిపూర్ పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
G20 dinner : జి 20 డిన్నర్‌కు మన్‌మోహన్ సింగ్, దేవగౌడ, నితీష్ కుమార్‌కు ఆహ్వానం
నిరసనకు ఒక రోజు ముందు మణిపూర్‌లోని ఐదు లోయ జిల్లాల్లో పూర్తి కర్ఫ్యూ విధించారు. మే 3వతేదీన మణిపూర్‌లో జాతి హింస చెలరేగడంతో 160 మందికి పైగా మరణించారు మరియు అనేక వందల మంది గాయపడ్డారు.