కంగనాకు గుణపాఠం చెప్పిన డిప్యూటీ సీఎం

కంగనౌ రనౌట్ భారత్‌లో ట్యాక్స్ చెల్లింపులపై సందేహాలకు క్లారిటీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పూనుకున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంగా మాట్లాడిన కంగనా ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో కొంత మంది మాత్రమే ట్యాక్స్ చేస్తుంటే వారి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు ఇలా ఆందోళనల్లో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఎకనామిక్స్‌లో బేసిక్స్ చెబుతూ ఓ పాఠం చెప్పారు. ఓ దినసరి కూలీ నేరుగా పన్ను చెల్లించకపోయినా అతను వాడే నిత్యవసరాల్లో పన్నులు కడుతూనే ఉన్నాడు. అహింస, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేయడం ప్రతి పరిస్థితిలోనూ తప్పు అన్నట్లే. ఇది మానవత్వానికి చట్టానికి వ్యతిరేకం. కానీ, ఈ దేశం కేవలం 3శాతం ట్యాక్స్ చెల్లించే వాళ్ల కోసమే కాదు. రోజువారీ కూలీ నుంచి బిలియనర్ వరకూ దేశంలోని ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కడుతూనే ఉన్నారు’ అని చెప్పారు.
हिंसा और पब्लिक प्रोपर्टी को नुक़सान पहुँचाना तो हर हाल में ग़लत है, यह इंसानियत और क़ानून दोनो के ख़िलाफ़ है. ..
पर यह देश सिर्फ़ 3% लोगों के टैक्स पर dependent नहीं है. एक सामान्य नौकरीपेशा, यहाँ तक कि एक दिहाड़ी मज़दूर से लेकर अरबपति तक, देश में हर आदमी टैक्स देता है. 1/3 https://t.co/nCHv3tnX4e— Manish Sisodia (@msisodia) December 24, 2019
ఆ హీరోయిన్ కు వచ్చే సంపాదనలో రోజువారీ కూలీ వాటా కూడా ఉంది. ‘సాధారణ రోజువారీ కూలీ సినిమాకు వెళ్తే.. కొనుగోలు చేసే టిక్కెట్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. అదే సినిమా స్టార్లకు వెళుతుంది. ఇప్పుడు ఆలోచించు ఎవరి మీద ఎవరు ఆధారపడుతున్నారో..’ అని కౌంటర్ ఇచ్చాడు.
అంతకుముందు కంగనా.. పంగా సినిమా సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళ హింసాత్మకంగా ఉండకూడదని హితవు చెబుతూనే.. మన దేశంలో కేవలం 3-4 శాంత మంది జనాభా మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని చెప్పింది. మిగిలిన వారంతా వీరిపైనే ఆధారపడుతున్నారు. కాబట్టి బస్సుల్ని, రైళ్లని దగ్ధం చేసి… దేశంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించింది. ఒక బస్సు ధర రూ.70నుంచి రూ.80 లక్షల వరకూ ఉంటుందని ఆందోళనకారులని పన్ను చెల్లించనివారిగా పేర్కొంటూ హెచ్చరించారు.