కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

Manmohan Singh Recovers From Covid Discharged From Hospital

Updated On : April 29, 2021 / 4:12 PM IST

Manmohan Singh మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(88)కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ నెల-19 మన్మోహన్ సింగ్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ “కోవాగ్జిన్”రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా మన్మోహన్ సింగ్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.

మార్చి-4న వ్యాక్సిన్ మొదటి డోసు,ఏప్రిల్-3న రెండో డోసు తీసుకున్నారు మన్మోహన్ సింగ్. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనాబారినపడిన మన్మోహన్..మైల్డ్ ఫీవర తో ఏప్రిల్-19 ముందుజాగ్రత్తగా ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీ ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్ లో 10 రోజులుగా ట్రీట్మెంట్ పొందుతున్న మన్మోహన్ సింగ్ కి కరోనా నుంచి కోలుకొని ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.