Mayawati: బీజేపీకి ఎస్పీకి లోపాయికారి ఒప్పందం.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్

ఇక బీజేపీతో ఎస్పీకి ఉన్న అంతర్గత అవగాహన ఎవరికీ కనిపించడం లేదు. ఎస్పీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో బీజేపీకి ఎక్కడా వాకోవర్ రావడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పనులన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా ముస్లిం సమాజం అస్తవ్యస్తం అవుతోంది.

Mayawati: బీజేపీకి ఎస్పీకి లోపాయికారి ఒప్పందం.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్

mayawati alleges sp over internal understanding with bjp

Updated On : September 10, 2022 / 7:52 PM IST

Mayawati: భారతీయ జనతా పార్టీకి సమాజ్‭వాదీ పార్టీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగానే బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా తాను అనుకున్న పనులు చేసుకుని పోతోందని ఆమె అన్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉంటూ ఎస్పీ ఏమీ చేయలేకపోతోందని, దానికి కారణం రెండు పార్టీల అంతర్గత ఒప్పందమేనని అయితే ఇది బయటికి ఎవరికీ కనిపిండం లేదని అన్నారు.

శనివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘యూపీలో ఎస్పీ ప్రజల మద్దతు కోల్పోతోంది. దీనికి ఆ పార్టీ సొంత విధానాలే కారణం. కుటంబంలో పార్టీలో పరస్పర కలహాలు, గొడవలు జరుగుతున్నాయి. అలాగే నేరస్తులతో బహిరంగ బంధం, జైలు మ్యాచింగ్ వగైరా వార్తలు మీడియాలో వస్తున్నాయి. మరి ఎస్పీపై ప్రజలకు నమ్మకం ఎలా కుదురుతుంది?

ఇక బీజేపీతో ఎస్పీకి ఉన్న అంతర్గత అవగాహన ఎవరికీ కనిపించడం లేదు. ఎస్పీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో బీజేపీకి ఎక్కడా వాకోవర్ రావడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పనులన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా ముస్లిం సమాజం అస్తవ్యస్తం అవుతోంది.

ఇలాంటి ప్రజా వ్యతిరేక లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అనియంత్రిత, చిన్నపిల్లల వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని ప్రజలే కాదు విపక్ష పార్టీలు కూడా జాగ్రత్త వహించాలి’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

BJP Shocked Purandeswari : పురందేశ్వరికి బీజేపీ షాక్..ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఇంఛార్జీ పదవుల నుంచి తొలగింపు