ఫ్రెండ్ ను చంపేశారు, ఆపై ముక్కలు ముక్కలుగా నరికి..బావిలో పడేశారు

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 01:06 PM IST
ఫ్రెండ్ ను చంపేశారు, ఆపై ముక్కలు ముక్కలుగా నరికి..బావిలో పడేశారు

Updated On : July 15, 2020 / 2:32 PM IST

క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచేలా ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఓ వ్యక్తిని తోటి స్నేహితులే కాటికి పంపారు.

డెడ్ బాడీ దొరకకుండా ఉండేందుకు ముక్కలు ముక్కలుగా నరికేసి బోరు బావిలో పడేశారు. విషయ పోలీసులకు తెలియడంతో స్నేహితులను విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. అతని డెడ్ బాడీని వెతికే పనిలో పడ్డారు. గత మూడు రోజులుగా బావి వద్ద తవ్వకాలు జరుపుతున్నా..ఎలాంటి ఆధారం లభ్యం కావడం లేదు.

పోలీసుల విచారణలో : – 
మీరట్ లో 25 సంవత్సరాలున్న రూపక్ ITI చదువుతున్నాడు. జూన్ 25వ తేదీన ఫ్రెండ్స్ దగ్గరకు వెళుతానని చెప్పి వెళ్లిపోయాడు. కానీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్నేహితులపై అనుమానం కలిగింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

సోదరిని అసభ్యంగా దూషించాారని : – 
స్నేహితులందరూ కలిసి ఉన్న సమయంలో సోదరి గురించి అసభ్యకరంగా మాట్లాడడంపై రూపక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనితో గొడవపడ్డాడు. వెంటనే ఓ వ్యక్తి గన్ తీసుకుని షూట్ చేయడంతో రూపక్ అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. చనిపోయాడని తెలుసుకున్న స్నేహితులు భయపడిపోయారు. డెడ్ బాడీ దొరకకుండా ఉండేందుకు డెడ్ బాడీని ముక్కలుముక్కలుగా నరికారు. అనంతరం బోరుబావిలో పడేశారు.

dumped in borewell

dumped in borewell

బోరు బావి వద్ద తవ్వకాలు : – 
దీంతో వారు చెప్పిన బోరు బావి వద్ద పోలీసులు నీటి పారుదల శాఖ సిబ్బందితో తవ్వకాలు చేపట్టారు. 50 ఫీట్ల వరకు తవ్వినా ఎలాంటి శరీర అవయవాలు లభ్యం కాలేదు. శరీర భాగాలు చాలా లోపున పడిపోయి ఉండాలని, లేకపోతే..నిందితులు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకపోవడంతో నలుగురిని అదుపులోకి తీసుకోలేదని, ఏదైనా ఆధారం దొరికితే కేసు బుక్ చేసి విచారణ చేస్తామన్నారు.