ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌ బాయ్‌.. ఇప్పుడు రెండు కంపెనీలకు యజమాని

అదే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌ బాయ్‌..  ఇప్పుడు రెండు కంపెనీలకు యజమాని

Updated On : October 19, 2024 / 8:23 PM IST

ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేసిన ఓ యువకుడు ఇప్పుడు రెండు కంపెనీలకు యజమాని అయ్యారు. మహారాష్ట్రలోని బీడ్‌ అనే గ్రామానికి చెందిన దాదాసాహెబ్ భగత్ అనే యువకుడి స్ఫూర్తివంతమైన స్టోరీ ఇది. పేద కుటుంబంలో పుట్టిన భగత్‌కు గొప్ప విజయాలు సాధించాలన్న తపన ఉండేది.

ఆ కలతోనే స్కూలు జీవితం ముగిశాక తన సొంత గ్రామాన్ని విడిచి పుణెలో అడుగుపెట్టారు. ఆ పదో తరగతి అర్హతతోనే భగత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లో డిప్లొమా కోర్సులోనూ చేరి దాన్ని పూర్తి చేశారు. నారాయణ మూర్తికి చెందిన ఇన్ఫోసిస్‌లో రూమ్ సర్వీస్ అటెండెంట్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

ఆ సమయంలో ఆయనలోని ప్రతిభ గురించి ఆయనకే సరిగ్గా తెలియదు. ఆ సమయంలో ఆయనకు నెలకు రూ.9,000 జీతం వచ్చేది. అలాగే, భగత్ ఓ యానిమేషన్ క్లాస్‌కు వెళ్తూ శిక్షణ తీసుకున్నారు. తన యానిమేషన్ కోర్సును పూర్తి చేసిన తర్వాత, అతను పైథాన్, C++ వంటి కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించారు.

అదే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత మెల్లిగా భగత్ తన మొదటి కంపెనీ నింత్‌మోషన్‌ను ప్రారంభించారు. అతి తక్కువ వ్యవధిలో భగత్ ప్రపంచ వ్యాప్తంగా 6,000 మంది క్లయింట్‌లను సంపాదించారు.

అందులో 9ఎక్స్‌ఎమ్‌ మ్యూజిక్ ఛానెల్ కూడా ఒకటి. చివరకు డిజైన్ లైబ్రరీలను రూపొందించడంపై పూర్తిగా దృష్టి పెట్టాడు. డోగ్రాఫిక్స్ అనే వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఇది కస్టమర్లకు కాన్వా వంటి డిజైన్‌లు, టెంప్లేట్‌లను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఆఫీస్‌ బాయ్‌గా పనిచేసిన భగత్‌ ఇప్పుడు రెండు కంపెనీలను స్థాపించి వాటికి సీఈవోగా ఉండడం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

ఆపరేషన్ చేసి మహిళ కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్‌.. 12 ఏళ్ల తర్వాత ఎలా తెలిసిందంటే?