MiG-21 : కుప్పకూలిన సైనిక విమానం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్-21 బైసన్ విమానం ఇవాళ(ఆగస్టు-25,2021)రాజస్తాన్‌లోని బర్మర్ లో కుప్పకూలింది.

Iaf Aircraft
MiG-21 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్-21 బైసన్ విమానం ఇవాళ(ఆగస్టు-25,2021)రాజస్తాన్‌లోని బర్మర్ జిల్లాలో కుప్పకూలింది. కాగా, ఈ ఏడాదిలో బైసన్ విమానం కూలిపోవడం ఇది నాలుగోసారి.
వెస్ట్రన్ సెక్టార్ లో ట్రెయినింగ్ కోసం బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన ఈ శిక్షణ విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి సాయంత్రం 5:30గంటల కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడని తెలిపింది. ఈ ప్రమాదంపై కోర్టు దర్యాప్తుకి ఆదేశించినట్లు తెలిపింది.
కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాదిలో కూలిపోయిన నాలుగో బైసన్ విమానం ఇది. ఈ ఏడాది మే 21వ తేదీన కూడా ఐఏఎఫ్ కి చెందిన మిగ్-21 బైసన్ శిక్షణ విమానం భారీ వర్షం కారణంగా పంజాబ్‌లోని పొలాల్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందారు. అంతకుముందు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.