Minister Smriti Irani : స్మృతి ఇరానీ స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా..? మంత్రి ఘాటు రిప్లై

నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్న మంత్రి స్మృతిఇరానీకి నెటిజన్ల నుంచి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటారు. అలా ఓ నెటిజన్ ఆమె వ్యక్తికత జీవితం గురించి ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు.

Minister Smriti Irani : స్మృతి ఇరానీ స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా..? మంత్రి ఘాటు రిప్లై

Smriti Irani married friend husband

Smriti Irani : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. దీంట్లో భాగంగా ఓ నెటిజన్ మంత్రి స్మృతి భర్త జుబిన్ ఇరానీ గురించి ప్రశ్నించారు. ‘మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా..?’అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి ఘాటుగా సమాధానం ఇస్తు. ‘‘నా భర్త జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా.. వయసులో తన కంటే 13 ఏళ్లు పెద్దది. కాబట్టి మోనా తన బాల్య స్నేహితురాలు అయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు. అంతేకాదు మోనా రాజకీయ నాయకురాలు కాదు..కాబట్టి ఆమెను రాజకీయాల్లోకి లాగొద్దు. నాకు మోనాతో ఎలాంటి సంబంధం లేదు. మోనా నేను స్నేహితులం కానే కాదు.ఏదైనా సమస్య ఉంటే నాతో పోరాడాలి అంతేగానీ సంబంధం లేని మోనాను దీంట్లోకి లాగొద్దు..ఆమెను గౌరవించండి’’అంటూ సమాధానం ఇచ్చారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.

కాగా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు స్మృతి. ఈ మధ్యలో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. పశువుల కొట్టంలో జీవించామని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటిగాను..చిరుద్యోగిగాను ఎన్నో పనులు చేసిన ఆమె కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఇక ఈ సెషన్‌లో ఆమె తనకు ఇష్టమైన ఆహారం, ప్రాంతాలు.. ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

Pakistan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాక్‌కు అవమానం .. అర్ధరాత్రి దాటినా కనిపించని పాక్ జెండా..

స్మృతి 2001లో తనకంటే వయస్సులో చాలా పెద్దవాడైన జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. స్మృతిని వివాహం చేసుకోకముందు జుబిన్‌ మోనాతో వివాహం అయ్యింది. అలా మోనా స్మృతి స్నేహితురాలు అంటూ నెటిజన్ ప్రశ్నించారు. దానికి ఆమె ఘాటుగానే సమాధానంగా ఇచ్చారు.

కాగా స్మృతి తండ్రి ఓ పంజాబీ. బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెద్దలు అంగీకరించపోయినా ఎదిరించి ఇద్దరు వివాహం చేసుకున్నారు. అలా దక్షిణ దిల్లీ శివార్లలో నివాసించేవారు. ఒక పశువుల కొట్టాన్ని చూసుకునే పనికి కుదురుకున్నారు. స్మృతి అక్కడే జన్మించారు. ఆమె తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఒక పక్క చదువుకుంటూనే పేదరికం వల్ల స్మృతి కొన్ని కుటుంబ బాధ్యతలు మోసారు. అమ్మానాన్నలు ఇద్దరు పనికి వెళితే చెల్లెళ్లను తానే చూసుకునేవారు. ఓ పక్క చదువుకుంటునే 10 క్లాస్ సమయంలోనే చిన్నపాటి ఆదాయం కోసం చిన్న ఉద్యోగాలు చేసేవారు. ఇంటర్మీడియట్ పాస్ అయినా ఆర్థిక కష్టాల వల్ల కాలేజీకి వెళ్లలేకు ఎన్నో చిన్న చిన్న పనులు చేసేవారు. అలా నటి అయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదిగి కేంద్రం మంత్రి స్థాయికి చేరుకున్నారు.