Non-Veg Food: ఇండియన్ విమానాల్లో నాన్‌వెజ్ ఫుడ్ నిషేదం కోరుతూ లేఖ

ఎయిర్ ఇండియా విమానంలో ఒక జైన ప్రయాణికుడికి అనుకోకుండా నాన్ వెజ్ ఫుడ్ అందించిన విషయం వివాదాస్పదంగా మారింది. దీంతో గుజరాత్ జంతు సంక్షేమ బోర్డు, జైన సంఘం దేశీయ విమానాల్లో అలాంటి భోజనం

Non-Veg Food: ఇండియన్ విమానాల్లో నాన్‌వెజ్ ఫుడ్ నిషేదం కోరుతూ లేఖ

Air Indian

Updated On : April 7, 2022 / 8:08 PM IST

Non-Veg Food: ఎయిర్ ఇండియా విమానంలో ఒక జైన ప్రయాణికుడికి అనుకోకుండా నాన్ వెజ్ ఫుడ్ అందించిన విషయం వివాదాస్పదంగా మారింది. దీంతో గుజరాత్ జంతు సంక్షేమ బోర్డు, జైన సంఘం దేశీయ విమానాల్లో అలాంటి భోజనం అందించడాన్ని నిషేధించాలని కోరింది. ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు.

‘శాకాహార ప్రయాణికుల తరపున ఈ అభ్యర్థన చేస్తున్నాం… శాకాహారానికి బదులు నాన్ వెజ్ ఫుడ్ వడ్డించినప్పుడు శాకాహార ప్రయాణికులు చాలా ఇబ్బందిగా, బాధకు గురవుతారు” అని బోర్డు సభ్యుడు రాజేంద్ర షా లేఖలో పేర్కొన్నారు.

రీసెంట్‌గా రాఘవేంద్ర జైన్ అనే ప్రయాణికుడు తాను మార్చి 25న ఎయిర్ ఇండియా విమానంలో టోక్యో నుండి ఢిల్లీకి కుటుంబంతో కలిసి ప్రయాణించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తాను ముందుగా బుక్ చేసుకున్న శాఖాహార భోజనాలను, చెక్-ఇన్ కౌంటర్‌లో ధ్రువీకరించినట్లు తెలిపారు. అయినప్పటికీ సిబ్బంది మాంసాహార భోజనం పెట్టడం అతణ్ని ఇబ్బందికి గురి చేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Read Also : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?

తనిఖీ చేయమని సిబ్బందిని కోరినప్పటికీ, ఇద్దరు సిబ్బంది భోజన రకాన్ని సాధారణంగా ‘ధ్రువీకరించారు’. పైగా ఇది శాఖాహార భోజనం అని అతనికి హామీ ఇచ్చారని జైన్ ఆరోపించారు. విమానంలో సిబ్బంది తమను వేధించారని, తప్పుకు క్షమాపణ కూడా చెప్పలేదని ఆయన ఆరోపించారు.

ఘటన తర్వాత, ఎయిర్ ఇండియా టోక్యో-ఢిల్లీ ఫ్లైట్‌లోని ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని గ్రౌండ్ చేసి, దర్యాప్తు ప్రారంభించింది.