Rivaba Jadeja: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్
అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు.

Rivaba Jadeja
Rivaba Jadeja – Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా మునిసిపల్ మేయర్ బినా కొతారి, ఎంపీ పూనంబెన్ మాదం(Poonamben Maadam)తో గొడవ పెట్టుకున్నారు. వారంతా బీజేపీ (BJP) నాయకురాళ్లే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జామ్నగర్ లో నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలోనే బీజేపీ నాయకురాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
దీనిపై రివాబా జడేజా స్పందిస్తూ… అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు. తాను అమర జవాన్లకు నివాళులు అర్పించే ముందు పాదరక్షలు విప్పానని తెలిపారు. ఆ తర్వాత అక్కడున్న వారంతా తనను చూసి తనలాగే పాదరక్షలు విప్పి నివాళులు అర్పించారని అన్నారు.
ఆ సమయంలో తనను ఎద్దేవా చేస్తూ ఎంపీ పూనంబెన్ కామెంట్స్ చేశారని, తెలివి మించిపోయిందని తనను అన్నారని రివాబా జడేజా తెలిపారు. ఆ వ్యాఖ్యలు తనకు వినపడ్డాయని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రపతి, ప్రధాని కూడా పాదరక్షలు విప్పరని ఆ ఎంపీ అన్నారని వివరించారు. దీంతో తాను ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆ సమయంలో మేయర్ బినా కొతారీ అనవసరంగా జోక్యం చేసుకుని ఎంపీకి మద్దతుగా మాట్లాడడానికి ప్రయత్నించారని చెప్పారు.
“औकात में रहें और ज्यादा होशियार न बनें”
ये रिवाबा जडेजा हैं. क्रिकेटर रविंद्र जडेजा की पत्नी हैं और पहली बार BJP से विधायक बनी हैं. जामनगर में मेयर और सांसद पर जमकर भड़क गईं. pic.twitter.com/2F3o1UwJot
— Utkarsh Singh (@UtkarshSingh_) August 17, 2023
Jaranwala: దైవదూషణ చేశారంటూ పాక్లో చర్చిలు, క్రైస్తవుల ఇళ్లను తగులబెట్టిన వైనం.. 100 మంది అరెస్ట్