అర్హతలు ఇవే : అగ్రకుల పేదలకూ రిజర్వేషన్లు
రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. కులమతాల ఆదారంగా కాకుండా

రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. కులమతాల ఆదారంగా కాకుండా
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈబీసీ కోటాకు ఆమోద ముద్ర వేసిన కేబినెట్.. రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. కులమతాల ఆదారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే కోటా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు అంటే ఎవరు? ఈ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయి? అర్హతలు, నియమ నిబంధనలు ఏంటి? అనే డౌట్స్ అందరికి ఉన్నాయి.
రిజర్వేషన్ అర్హతలు
రిజర్వేషన్ అర్హతలు |
---|
* వార్షిక ఆదాయం రూ.8లక్షలకు మించకూడదు |
* వ్యవసాయ భూమి 5 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి |
* వెయ్యి చదరపు అడుగుల లోపు సొంతిల్లు మాత్రమే ఉండాలి |
* నోటిఫైడ్ మున్సిపాలిటీలో 109 చదరపు గజాలలోపు ఇంటి స్థలం |
* నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో 200 చదరపు గజాలలోపు ఇంటి స్థలం |
* బ్రాహ్మణులు, ఠాకూర్, బనియా, జాట్, గుజ్జర్ ఇతర అగ్రవర్ణాలు |
* విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు |
ఈ అర్హతలు ఉన్నవారే ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లు పొందగలరు. ఈబీసీ కోటా రిజర్వేషన్ చట్టంగా మారేందుకు ఆర్టికల్ 15, 16ను కేంద్రం సవరించనుంది. జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.