చైనా నుంచి జెండా ఎత్తేసే సంస్థలకు ఇండియా రెడ్ కార్పెట్

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 05:16 AM IST
చైనా నుంచి జెండా ఎత్తేసే సంస్థలకు ఇండియా రెడ్ కార్పెట్

Updated On : April 28, 2020 / 5:16 AM IST

చైనా నస్టాన్నితమకు లాభంగా వాడుకోవాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. చైనా నుంచి బైటకొచ్చే సంస్థలకు పూలదండతో స్వాగతం పలకడానికి మాస్టర్ ప్లాన్ వేశారు మోడీ. ఫ్యార్చూన్ 500 కంపెనీలే టార్గెట్.  ప్రధానిమంత్రి కార్యాలయం నేతృత్వంలో. నీతిఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ కలసి చైనా నుంచి బైటపడదామని భావిస్తున్న సంస్థలను మనవైపు ఆకట్టుకొనేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి.

 ఎలక్ట్రానిక్, మెడికల్ డివైసెస్‌ల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్నారు. అంటే  తయారీకి సంబంధించిన capital expenditure benefitsలాంటివన్నమాట.  

Covid-19 pandemicలాంటి విపత్తుసమయంలో మల్టీనేషనల్ కంపెనీలకు జ్జానోదయమైంది. అన్నింటిని ఒకేచోట కేంద్రీకరించడం వల్ల చైనా దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సివస్తోందని, అందుకే కొన్నింటినైనా భారత్, బ్రెజిల్, మెక్సికో లాంటి తరలించాలి లేదంటే కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకొంటున్నాయి. ఇలాంటి సంస్థలే ఇండియా టార్గెట్. సీఈఓలతో ముఖాముఖి మాట్లాడుతోంది. రండి… మీరుకోరుకున్న చోట సదుపాయాలనిస్తామని అంటోంది.

ఇండియా ప్లానేంటి? 

పెట్టుబడిదారులతో సరాసరి మాట్లాడటం. ఇప్పటికే కనీసం వంద కంపెనీలను భారతీయ ప్రతినిధులు కలిశారు. ప్రోత్సాహకాల ప్రపోజనల్‌నిచ్చారు. కంపెనీల ప్రాధాన్యాతలను బట్టి ఏయేరాష్ట్రాలు బెటరో…వాటిని సిద్ధం చేస్తున్నారు.  ముందు electronics,medicaldevicesలతో మొదలుపెట్టి…మిగిలిన రంగాలకూ ప్రోత్సాహకాలను ప్రకటించాలన్నది మోడీ ప్లాన్. కార్పొరేట్ టాక్స్ కట్ గురించి ఇప్పటికిప్పుడు ఏం చెప్పకపోయినా, చైనాను మించే  సదుపాయాలను కల్పించనున్నారు. Department for Promotion of Industry and Internal Trade (DPIIT)ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్‌లున్న రాష్ట్రాలు, కంపెనీలకు సత్వరం అనుమతులనిచ్చే రాష్ట్రాలను లిస్ట్ చేశారు. చైనాలో పెద్ద బహుశాజాతి సంస్థలను ప్రతినిధులను పట్టుబడిమరీ భారతదేశ ప్రతినిధులు కలుస్తున్నారు. వారిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.