చౌకబేరం : మోడీ బొమ్మలతో చీరలు

చౌకబేరం : మోడీ బొమ్మలతో చీరలు

ప్రచారం అంటే మోడీనే ఐకాన్.. దేన్నీ వదలరే అనుకుంటారు జనం. 2019 ఎన్నికలు వస్తున్న టైంలో బీజేపీ సరికొత్త ప్రచారానికి తెరతీసింది. బ్రాండ్ మోడీ పేరుతో.. చీరలు, చొక్కాలపై బొమ్మలు వేస్తోంది. అక్కడా ఇక్కడా అయితే అందరికీ చేరవు అనుకున్నారో ఏమో.. ఏకంగా గుజరాత్ లోని వస్త్ర పరిశ్రమను టార్గెట్ చేశారు. కోట్ల సంఖ్యలో మోడీ బొమ్మలతో చీరలు, చొక్కాలు, టీషర్టులను సిద్ధం చేశారు. సూరత్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలను వీటిని ఎగుమతి చేయనున్నారు. 

ఆర్డర్ పెట్టిన వ్యాపారులకు.. క్రెడిట్ కింద ఈ సరుకు పంపిస్తున్నారంట. ఏ విధంగానైనా సరే.. ప్రతి మహిళ మోడీ చీర కట్టాల్సిందే.. ప్రతి మగాడు మోడీ టీషర్ట్, బనీను వేసుకోవాల్సిందే అంటోంది బీజేపీ. ఆ చీరల పంపిణీ దారులు వీటిని నాలుగు రకాల ప్రింట్‌లతో సిద్ధం చేశామని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఇంకొందరి రాజకీయ నాయకుల ఫొటోలతో చీరలు సిద్ధం చేస్తామని తెలిపారు. 

ఇటీవల హైదరాబాద్‌లో తన కొడుకు పెళ్లికి ప్రచురించిన వెడ్డింగ్ కార్డుల్లోనూ 2019 ఎన్నికల్లో మోడీకి ఓటేయాలంటూ ప్రచురించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లికొడుకు తండ్రి పెళ్లికి వచ్చిన వాళ్లని బహమతులు ఇవ్వడానికి బదులు మోడీకి ఓటేయమని కోరాడట.