భారత పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుంది.. మోడీ మంచి మిత్రుడు
భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ

భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ
భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు అని చెప్పారు. భారత్-చైనా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని జిన్ పింగ్ స్పష్టం చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నైలోని మహాబలిపురం సందర్శించారు. మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను ప్రధాని మోడీ, జిన్ పింగ్ వీక్షించారు. చారిత్రక కట్టడాలను మోడీ, జిన్ పింగ్ వీక్షించారు. మహాబలిపురంలోని ఆలయాల ప్రత్యేకత గురించి, రాతి శిల్పకళా కట్టడాలు, ఏకశిలా కట్టడాల విశిష్ఠతను, కృష్ణుడి వెన్నముద్ద శిలను జిన్ పింగ్ కు మోడీ వివరించారు.
మహాబలిపురంలో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. గంటకు పైగా శోర్ దేవాలయంలో సమావేశం జరిపారు. అంతకుముందు మోడీ, జిన్ పింగ్ లు కోవలంలో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి, వాణిజ్య, అంతర్జాతీయ సరిహద్దులు వంటి విషయాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు లేదు. కేవలం వాణిజ్యం, సహకారం వంటివాటిపైనే చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిన్ పింగ్.. మోడీ మంచి మిత్రుడని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు.
ప్రపంచ దేశాలతో చైనాకు ఉన్న ప్రాచీన సంబంధాలతోపాటు చరిత్ర, సంస్కృతి అంటే జిన్‌పింగ్‌కు ఎంతో ఇష్టం. మరోవైపు ఇన్ ఫార్మల్ మీటింగ్‌కు వేదికను ఢిల్లీకి దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులను మోడీ ఆదేశించారు. అలా మహాబలిపురం కరెక్టుగా సరిపోతుందని ఎంపిక చేశారు మోడీ.
గత ఏడాది తాను చైనాలో పర్యటించాను అని ప్రధాని మోడీ అన్నారు. అప్పటి నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయని చెప్పారు. 2వేల ఏళ్ల క్రితమే చైనా, మహాబలిపురం మధ్య వాణిజ్య సంబంధాలు జరిగాయని తెలిపారు. ఆర్థిక శక్తిగా చైనా, భారత్ ఎదుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు.