PPF నిబంధనల సవరింపు

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిబంధనలను సవరించింది. దీనిప్రకారం ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్‌మెంట్‌ చేయటం ఇకపై వీలు కాదు.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 03:10 AM IST
PPF నిబంధనల సవరింపు

Updated On : December 18, 2019 / 3:10 AM IST

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిబంధనలను సవరించింది. దీనిప్రకారం ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్‌మెంట్‌ చేయటం ఇకపై వీలు కాదు.

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిబంధనలను సవరించింది. దీనిప్రకారం ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్‌మెంట్‌ చేయటం ఇకపై వీలు కాదు. పాత నిబంధనల స్థానంలో ‘పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ 2019’ కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఖాతాదారు బాకీ ఉన్న మొత్తాన్ని జమచేయటం కోసం దేశంలో ఏ కోర్టు ఆర్డర్‌ లేదా డిక్రీ ఇచ్చినప్పటికీ, పీపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎటాచ్‌ చేయటం వీలుకాదు.
 
మెచ్యూరిటీ అనంతరం కూడా ఖాతాదారు పీపీఎఫ్‌ ఖాతాను పొడిగించుకునే అవకాశం కల్పించారు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందినప్పటికీ ఖాతాదారు తన పీఎఫ్‌ ఖాతాను కొనసాగించుకోవచ్చు..  ఏ వ్యక్తి అయినా ఫాం 1 దరఖాస్తును సమర్పించి ఇకపై ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను పొందవచ్చు. అయితే ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఉమ్మడి ఖాతాను తెరిచేందుకు అవకాశం లేకుండా చేశారు. ఖాతాదారు ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం 500 నుంచి అత్యధికంగా లక్షన్నర వరకు పీఎఫ్‌ ఖాతాలో జమచేసుకోవచ్చు. 

అలాగే మెచ్యూరిటీ తర్వాత కూడా పీఎఫ్ అకౌంట్ హోల్డర్ పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకునేందుకు ఈ కొత్త నిబంధన వీలు కల్పిస్తోంది. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందినప్పటికీ పీఎఫ్ కాతాదారు తన ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి పదిహేను ఏళ్ల తర్వాత మరో ఐదు సంవత్సరాల వ్యవధికి ఖాతాను పొడిగించుకునే వీలు ఉంటుంది. 

అకౌంట్ తెరిచిన సంవత్సరం చివరి నుంచి ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఖాతా నుంచి పీపీఎఫ్ ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. అయితే తన అకౌంట్లోని మొత్తంలో 50 శాతానికి మించకుండా లేదా అంతకుముందు ఏడాది మొత్తం.. ఇందులో ఏది తక్కువైతే దానిని విత్ డ్రా చేసుకోవచ్చు.

ఫారం 1ను సమర్పించి ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను తెరువచ్చు. అయితే ఇందులో ఉమ్మడి ఖాతా తెరిచేందుకు వీలుకాదు. సంరక్షకులు మైనర్ లేదా మానసిక పరిస్థితి సరిగా లేని వారి తరఫున కూడా ఖాతా తెరువొచ్చు. ఇలాంటప్పుడు వారి పేరుపై ఒకే ఖాతాను తెరవచ్చు. ఖాతాదారు ఓ ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పీఎఫ్ అకౌంట్లో జమ చేయవచ్చు.