ఐసొలేషన్ వార్డులుగా 20వేల రైలు బోగీలు

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా వైరస్ వణికిస్తుంది. కరోనా వైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20వేల రైల్వే బోగిలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. జోనల్ రైల్వే మేనేజర్లందరికీ రాసిన ఒక లేఖలో కోవిడ్ 19 బాధపడుతున్న వారికి చికిత్సను అందించేందుకు ముందుగా 5వేల రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. మెుత్తం మీద 3.2 లక్షల బెడ్స్ ను అందుబాటులో ఉంచగలదని మంగళవారం(మార్చి31,2020)న భారతీయ రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం తెలంగాణాలోని సికింద్రాబాద్ లో 486 బోగిలను , ముంబై ప్రధాన కార్యాలయం సెంట్రల్ రైల్వే లో 482 బోగిలను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చటానికి కేటాయించింది రైల్వే బోర్డు. మెుత్తం 20వేల బోగిల్లలో అవసరానికి తగ్గినట్టుగా 3.2 లక్షల బెడ్స్ ను కలిగి ఉంటాయి. ఇప్పటికే 5 వేల బోగిలను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చబడతున్నాయి అని తెలిపింది.
ఈ 5 వేల బోగీల్లో పూర్తి వసతులతో కూడిన 80వేల బెడ్స్ ఉంటాయి. కనీసం ఒక కోచ్ లో 16 బెడ్స్ ను కలిగి ఉంటాయని రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. నాన్ ఎసి ఐపిఎఫ్ స్లీపర్ కోచ్ లను మాత్రమే ఐసోలేషన్ కోచ్ లుగా మార్చటానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read | దడ పుట్టిస్తున్న ఢిల్లీ.. ఒక్కరోజే 25 కరోనా పాజిటివ్ కేసులు