షాప్‌లో పనికి హెల్పర్ కావలెను.. రూ.25,000 జీతం.. ప్రకటన చూశారా?

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా మొదట్లో ఇంత జీతం రాదని కామెంట్లు చేస్తున్నారు.

షాప్‌లో పనికి హెల్పర్ కావలెను.. రూ.25,000 జీతం.. ప్రకటన చూశారా?

Viral Pic

చదువు ముగించుకుని ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తేగానీ జాబ్ రాదు. అది కూడా చాలీచాలని జీతంతో ట్రైనీగా పనిచేయాల్సి వస్తుంది. ఇక చదువుకోని వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అసలే నిరుద్యోగ భారతం.

అనుకున్న జాబ్ దొరకకపోతే దుకాణాల్లో, షాపింగ్ మాల్స్ లో పనిచేస్తుంటాం. దుకాణాల్లో పనిచేసేవారి జీతం ఎంత ఉంటుంది. ఎన్ని ఏళ్లుగా పనిచేసినా రూ.12-రూ.15 వేల మధ్యే జీతం ఇస్తారు. అయితే, ఓ మోమోస్ షాప్ మాత్రం తమ వద్ద హెల్పర్ ఉద్యోగంలో చేరితే స్టార్టింగ్ లోనే రూ.25,000 ఇస్తామని ప్రకటన ఇచ్చింది.

ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా మొదట్లో ఇంత జీతం రాదని కామెంట్లు చేస్తున్నారు. అమృతా సింగ్ అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ఇంటర్నెట్లో విపరీతంగా స్పందన వస్తోంది. హిందీలో ఉద్యోగ ప్రకటనకు వివరాలను పోస్టర్ పై రాసుకొచ్చారు.

ఇప్పుడే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటామని కొందరు సెటైర్లు వేశారు. అంత మొత్తంలో జీతంతో పాటు తినడానికి ప్రతిరోజు ఉచితంగా మోమోలు కూడా దక్కుతాయని కొందరు రాసుకొచ్చారు. ఈ షాప్ ఎక్కడ ఉందో కానీ ఆ ఉద్యోగ ప్రకటనపై మాత్రం అందరిలోనే ఆసక్తి రేపుతోంది.

చూపుడు వేలిపై కూర్చున్న ఈ అత్యంత అరుదైన జంతువు ఎక్కడ కనపడిందో తెలుసా?