ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై మనీ లాండరింగ్ కేసు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటైన ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్‌పై ఉచ్చు బిగిసింది. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై ఈడీ… మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఈ కేసు 25వేల కోట్ల విలువైన మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణానికి సంబంధించినది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పవార్ ద్వయంతో పాటు ఇతరులపై ఈసీఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.