IMD: అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ

వచ్చే నెల చివరి నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

IMD: అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ

Rain

భారత్‌లో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ (భారత వాతావరణ శాఖ)తెలిపింది. దీర్ఘకాల సగటుతో పోల్చితే రానున్న వర్షాకాలంలో 106 శాతం వర్షపాతం ఉండొచ్చని పేర్కొంది.

దేశంలో సాధారణంగా దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాల ప్రారంభ సమయంలో ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది. ఈ పరిస్థితులు వానలు కురియడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మధ్య పసిఫిక్‌ సముద్రం మీదుగా ఎల్‌నినో కొనసాగుతోందని చెప్పింది.

వచ్చే నెల చివరి నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది జూన్‌ లో పూర్తిగా అది తగ్గి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. జూలై చివర్లో లా నినా పరిస్థితులు ఏర్పడి వర్షాలు అధికంగా కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, స్కైమెట్‌ కూడా ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

Huge Amount Seized : వామ్మో.. రూ.4వేల 650 కోట్లు సీజ్, 75ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి