Parliament Monsoon Sessions : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 28 బిల్లులతోపాటు యూసీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.

Parliament Monsoon Sessions : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 28 బిల్లులతోపాటు యూసీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Monsoon Sessions

Updated On : July 19, 2023 / 2:10 PM IST

Union Government : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. పాత పార్లమెంట్ భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ పై పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో ఉంది.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు 2021, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2022, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు 2022, మధ్యవర్తిత్వ బిల్లు 2021, రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు 2022, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు 2023, ఢిల్లీలో పాలనా అధికారాల సవరణ బిల్లు వంటి తదితర బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి.

Left Parties: బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా, వద్దా.. తెలంగాణలో వామపక్షాల తర్జనభర్జన

పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్ లో సమావేశం జరగనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు ఇవ్వాలని, చర్చల్లో పాల్గొనాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరునుంది. మద్యాహ్నం ఒంటి గంటకి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన లోక్ సభా పక్ష నేతల సమావేశం జరుగుంది. లోక్ సభ సమావేశాలకు సహకరించాలని, సభా మర్యాదలు పాటించాలని, బిల్లులపై చర్చల్లో పాల్గొనాలని లోక్ సభా పక్ష నేతలను స్పీకర్ కోరనున్నారు.

Srinivasa Rao : ఎన్డీఏ భేటీకి ఎందుకెళ్లారు.. ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి : సీపీఎం నేత శ్రీనివాసరావు

మణిపూర్ హింస, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైల్వే భద్రత, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, అదాని షేర్ల వ్యవహారంపై జేపీసీ, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచడం, గవర్నర్ వ్యవస్థ దురుపయోగం, ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్ర ఆర్డినెన్స్, చైనా సరిహద్దు వివాదం సహా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. యూనిఫామ్ సివిల్ కోడ్, ఢిల్లీలో పాలనా అధికారాల ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడం సహా కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.