Children Orphaned: కరోనా కారణంగా దేశంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?

కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయాయి. ఈ సమయంలో 3,621 మంది పిల్లలు అనాథలుగా అవ్వగా, 26వేల మందికి పైగా తల్లి లేదా తండ్రిని కోల్పోయారు.

Children Orphaned: కరోనా కారణంగా దేశంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?

More Than 3500 Children Orphaned Over 26000 Lost A Parent Since April 2020 Ncpcr

Updated On : June 8, 2021 / 4:18 PM IST

The child rights body: కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయాయి. ఈ సమయంలో 3,621 మంది పిల్లలు అనాథలుగా అవ్వగా, 26వేల మందికి పైగా తల్లి లేదా తండ్రిని కోల్పోయారు. జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) ఈ మేరకు లెక్కలను సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మొత్తం 26,176 మంది పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోయారని, 3,621 మంది అనాథలు కాగా.. 274 మందిని తల్లిదండ్రులు వదిలిపెట్టేశారని నివేదికలో తెలిపారు.

అయితే, తల్లిదండ్రుల మరణాలు, కేవలం COVID-19 కి సంబంధించినవి కాదని, ఇతర కారణాల వల్ల కూడా అయ్యి ఉండవచ్చునని పిల్లల హక్కుల సంఘం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 జూన్ 5 వరకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల గురించి రాష్ట్రాల వారీగా సమాచారం అందుకున్నట్లు కమిషన్ తెలిపింది. వారి మరణ కారణంతో సంబంధం లేకుండా వారి వివరాలను ‘బాల్ స్వరాజ్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు చెప్పారు.

మహారాష్ట్ర అత్యంత ఘోరంగా ప్రభావితమైన రాష్ట్రం కాగా.. ఈ రాష్ట్రంలో 7,084 మంది పిల్లలు అనాథలు అయ్యారు. వదలివేయబడ్డారు లేదా తల్లి లేదా తండ్రిని కోల్పోయారు, ఎక్కువగా కరోనావైరస్ కారణంగా ఉత్తర ప్రదేశ్(3,172), రాజస్థాన్ (2,482), హర్యానా (2,438), మధ్యప్రదేశ్ (2,243), ఆంధ్రప్రదేశ్(2,089), కేరళ (2,002), బీహార్ (1,634), ఒడిశా (1,073)

మహారాష్ట్రలో మొత్తం 7,084 మంది పిల్లలలో 6,865 మంది ఒక తల్లి లేదా తండ్రిని కోల్పోయారు, 217 మంది అనాథలు అయ్యారు. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే వదిలిపెట్టేశారు. 226 మందిని వదిలిపెట్టిన జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా, పెద్ద సంఖ్యలో పిల్లలు 8-13 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నారని వదిలేశారు. ఈ వయస్సులో 11,815 మంది పిల్లలను తల్లిదండ్రులే వదిలిపెట్టారు.