Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై 16 రోజుల వాదనల అనంతరం సుప్రీంకోర్టు స్పందన ఏంటంటే?

చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితరుల వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ లేదా ప్రతివాది తరఫు న్యాయవాది ఎవరైనా రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలనుకుంటే..

Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై 16 రోజుల వాదనల అనంతరం సుప్రీంకోర్టు స్పందన ఏంటంటే?

Updated On : September 5, 2023 / 7:17 PM IST

Jammu and Kashmir: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Bharat Name Row: భారత్ పేరు మార్పుపై ఓవైపు తీవ్ర వివాదం సాగుతోంది.. ఇంతలో మరోకొత్త పేరు చెప్పిన అస్సాం సీఎం

చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితరుల వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ లేదా ప్రతివాది తరఫు న్యాయవాది ఎవరైనా రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలనుకుంటే, వచ్చే మూడు రోజుల్లోగా దాఖలు చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే లిఖిత పూర్వక వాదన రెండు పేజీలకు మించకూడదని కోర్టు పేర్కొంది.

Bharat: ఇండియా పేరును ఎలా మార్చుతారో తెలుసా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

గత 16 రోజుల విచారణలో, కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు- హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి గిరి ఇతరులు ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్న జోక్యందారులను కోర్టు విచారించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, జూన్ 20న జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించడం, ఈ నిబంధనను రద్దు చేస్తూ కేంద్రం ఆగస్టు 5, 2019 నాటి నిర్ణయానికి సంబంధించి రాజ్యాంగ చెల్లుబాటును న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

Rajasthan Politics: భారత్ మాతాకి జై అంటుండగా ఆపి కాంగ్రెస్ జిందాబాద్ అనిపించిన కాంగ్రెస్ నేత

2018 డిసెంబర్ 19 రాష్ట్రపతి పాలన విధించడంతో పాటు 3 జూలై 2019న పొడిగింపుతో సహా పలు అంశాలపై తమ అభిప్రాయాలను అందించారు. ఆర్టికల్ 370, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 రద్దును సవాలు చేస్తూ అనేక పిటిషన్లు 2019లో రాజ్యాంగ ధర్మాసనానికి పంపబడ్డాయి. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 కారణంగా, పూర్వపు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, లధాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడ్డాయి.