Moscow-Goa Flight Bomb Threat : మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. గుజరాత్ లో అత్యవసరంగా ల్యాండింగ్

మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Moscow-Goa Flight Bomb Threat : మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. గుజరాత్ లో అత్యవసరంగా ల్యాండింగ్

bomb threat

Updated On : January 10, 2023 / 8:01 AM IST

Moscow-Goa Flight Bomb Threat : మాస్కో-గోవా విమానానికి అగంతకుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం నుంచి 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది కిందికి దిగారు. అనంతరం విమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో ఉంచారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కలిసి విమానాన్ని తనిఖీ చేశారు. ఫ్లైట్ లో ఎలాంటి బాంబు లభించలేదు.

బాంబు లేదని నిర్ధారించడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు రష్యన్ ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. 244 మంది ప్రయాణికులతో మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన అజుర్ ఎయిర్ ఫ్లైట్ లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత అధికార వర్గాలు రష్యన్ ఎంబసీని అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో గుజరాత్ జామ్ నగర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించింది.

Bomb Threat Iranian Flight : ఇరాన్‌ విమానానికి బాంబు బెదిరింపు

ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. విమానంలో పోలీసులు, బాంబు స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని రష్యన్ ఎంబసీ పేర్కొంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో గోవాలోని దబోలిమ్ ఎయిర్ పోర్టు దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎయిర్ పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. గతంలో కూడా పలు విమానాలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.