H3N2 virus : దేశంలో భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలేంటో తెలుసా?

దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింది.

H3N2 virus : దేశంలో భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలేంటో తెలుసా?

H3N2 virus

Updated On : March 5, 2023 / 3:22 PM IST

H3N2 virus : దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింది. అధిక సంఖ్యలో జనం ఆస్పత్రుల్లో చేరడానికి ఈ వైరస్ కారణమవుతుందని ఐసీఎమ్ఆర్ తెలిపింది. ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం కావడంతో ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ల సంఖ్య మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐసీఎమ్ఆర్ అంటోంది.

హెచ్3ఎన్2తో ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో 92 శాతం మంది రోగులకు జ్వరం, 86 శాతం మంది రోగులకు దగ్గు, 27 శాతం మందికి శ్వాస ఆడకపోవడం, 16 శాతం మందికి శ్వాస లోపం ఉన్నట్లు గుర్తించారు. దీనికి అదనంగా 16 శాతం మంది రోగులకు నిమోనియా, 6 శాతం మందికి మూర్చ సమస్యలు ఉన్నాయని ఐసీఎమ్ఆర్ పరిశీలనలో వెల్లడైంది. హెచ్3ఎన్2తో బాధపడుతున్న వారిలో 10 శాతం మంది రోగులకు ఆక్సిజన్, 7 శాతం మందికి ఐసీయూ సంరక్షణ అవసరమని ఐసీఎమ్ఆర్ అభిప్రాయపడింది.

Brain Eating Amoeba : మెదడును తినేసే అమీబా..! మరో వ్యక్తి మృతి..ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన

ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ముఖ్యంగా పెద్దవారిలో, చిన్నపిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఇది రెగ్యులర్ గా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణమని గుర్తించారు. దీన్ని హెచ్3ఎన్2 అనే వేరియంట్ గా ఐసీఎమ్ఆర్ గుర్తించింది. దీని ప్రభావంతో ఎక్కువ శాతం మంది తీవ్రమైన దగ్గు, ఊపరితిత్తుల సమస్యల బారని పడుతున్నారని తెలిపారు.