ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్

మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ బ్రాండ్ వాల్యూ ఏర్పాటు చేసుకున్న ఫుడ్ సప్లై సర్వీస్ జొమాటో. డెలీవరీ బాయ్‌ల దగ్గర్నుంచి కస్టమర్ సపోర్ట్‌లోనూ మంచి సేవలందించాలనే తాపత్రయంతో కస్టమర్లకు అనుకూలంగా, వాళ్లకు అర్థమయ్యే భాషలోనే సమాధానాలిస్తున్నారు. ఇటీవల ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు ఓ జొమాటో కస్టమర్ నుంచి వచ్చిన సమాధానం నెట్టింట్లో వైరల్ అయింది.
జొమాటో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు ఓ కస్టమర్. డెలీవరి ఇంటికి వస్తుందని ఎదురుచూస్తుండగా సడెన్‌గా మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజ్ వచ్చింది. దాంతో విసుగు చెందిన కస్టమర్ జొమాటో చాట్‌లో కంప్లైంట్ చేశాడు. స్పందించిన ప్రతినిధి వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఇంకో ఆర్డర్ చేసుకోవాలని పాత ఆర్డర్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు.
అయితే అప్పటికే తన పాత ఆర్డర్ డబ్బులు చెల్లించేశానని వాటి సంగతేంటని ప్రశ్నించగా, మీ డబ్బులు 4నుంచి 5 బిజినెస్ రోజుల్లోగా అకౌంట్ లోకి వచ్చి చేరతాయని తెలిపారు. దానికి కస్టమర్ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ రాకపోతే ఏం చేయాలన్నాడు. వచ్చేస్తాయ్ సార్… పక్కాగా వస్తాయ్ అనుమానమే లేదన్నట్లు చెప్పాడు. అప్పటికీ నమ్మకం కుదరక కస్టమర్ అమ్మతోడుగా చెప్పు అని అడగడంతో అమ్మతోడు సార్.. మీ డబ్బులు వస్తాయ్ అని బదులిచ్చాడు.
2016లోనూ కస్టమర్‌తో జరిగిన ఫన్నీ సంభాషణను సంస్థ సహ యజమాని అయిన పంకజ్ చడ్డా ఇలానే స్క్రీన్ షాట్‌ల రూపంలో షేర్ చేశాడు.
Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట
Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స
Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం
Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే
Also Read : ఫిబ్రవరిలోనే లాంచ్ : ‘రెడ్ మీ నోట్ 7’ వచ్చేస్తోంది
Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు