ఆవు మూత్రంతోనే ఆఫీసులు కడగాలి..బీజేపీ సర్కార్ ఆదేశాలు

ఆవు మూత్రంతోనే ఆఫీసులు కడగాలి..బీజేపీ సర్కార్ ఆదేశాలు

Updated On : February 2, 2021 / 9:32 PM IST

‘Gau Mutra’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌నే వాడాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. దేశంలోనే మొదటిసారిగా గతేడాది నవంబర్ లో కొత్తగా సృష్టించిన “కౌ కేబినెట్” మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకోబడింది.

తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ…ఆవు మూత్రం బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహించడం, ఆవు ఫినైల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారడంతో.. నెటిజెన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా,మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆశ్రమాల్లోని 1,80,000 ఆవులను మేపడానికి రూ.11 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. భారతదేశం మొట్టమొదటి ఆవు అభయారణ్యం 2017 లో మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో స్థాపించారు. 472 హెక్టార్లలో విస్తరించి ఉన్న కామధేను గౌ అభ్యారణ్‌లో 6,000 ఆవులను పూర్తి సామర్థ్యంతో ఉంచే కెపాసిటి కలిగిఉన్నది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా దీనిని ప్రభుత్వం ప్రైవేటీకరించింది.