ఆరేళ్లుగా పంజరంలోనే ఉంటున్న రామచిలుక మూడు గుడ్లు పెట్టింది!!    

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 06:53 AM IST
ఆరేళ్లుగా పంజరంలోనే ఉంటున్న రామచిలుక మూడు గుడ్లు పెట్టింది!!    

Updated On : February 27, 2020 / 6:53 AM IST

ఆరు సంవత్సరాల నుంచి పంజరంలోనే బందీగా ఉండే ఓ రామచిలుక మూడు గుడ్లు పెట్టింది!. అది చూసిన దాని యజమాని షాక్ అయ్యాడు. ఈ విచిత్రం  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక విచిత్ర ఉదంతం జరిగింది!!.

ఈ సంగతి తెలిసిన రామచిలుక యజమాని సతీష్ తివారాతో పాటు తెలిసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదెలా సాధ్యమబ్బా!! అని పదే పదే షాక్ అవుతున్నారు. ఆ రామచిలుకను పెంచుతున్న దాని యజమాని సతీష్ తివారీ ఆ గుడ్లను చూసి తన గుడ్లు తేలేశారు. ఆరేళ్లుగా పంజరంలోనే ఉంటున్న రామ చిలుక రెండు రోజుల్లో మూడు గుడ్లను పెట్టింది. వాటిలో ఒక గుడ్డును ఆ రామ చిలుకనే పగులగొట్టింది. రెండు గుడ్లు బాగానే ఉన్నాయి.
జవని నెలలో 28,29న రెండు గుడ్లు పెట్టగా మరో రెండు రోజుల తరువాత మూడవ గుడ్డు పెట్టిందని దాంట్లో ఒక గుడ్డును చిలుక పగులగొట్టేసిందని సతీష్ తివారీ తెలిపారు. 

దీనిపై వన్యప్రాణి విశ్లేషకులు మాట్లాడుతూ..పంజరంలో ఉండే పక్షులు మగపక్షితో జత కట్టకపోయిన గుడ్లను పెట్టడం సహజమేనని..కానీ ఆ గుడ్లు పిల్లలుగా మారవని..సతీష్ తివారీ ఇంట్లోని రామచిలుక పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు పుట్టవని తెలిపారు. ఇటువంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయన్నారు. ఫైల్ట్రీల్లో ఉండే కోళ్లు గుడ్లు పెట్టినట్లే రామ చిలుక కూడా పెట్టిందని తెలిపారు.

Read More>>ఢిల్లీలో అల్లర్లు :మానవహారంగా నిలబడి విద్యార్ధుల్ని స్కూల్స్‌కు ఎలా పంపుతున్నారో చూడండీ