ఓట్లర్ల చైతన్యం : తల్లిని చేతులమీద..తండ్రిని వీపు మీద మోసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారు

Mp Elections : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనే చైతన్యం ప్రజల్లో బాగా కనిపిస్తోంది. బీహార్ తో పాటు దేశంలో పలు ప్రాంతాలతో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యంతో బూత్ లకు వచ్చి ఓట్లు వేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి తన తల్లిని చేతుల మీద ఎత్తుకొచ్చి ఓటు వేయించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ రోజు మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అలాగే హర్యానాలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు ఓ వ్యక్తి తన తండ్రిని తన వీపుపై మోసుకుని భైన్స్వాల్ కలాన్ ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించాడు. బీహార్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు (నవంబర్ 3,2020) ఉదయం 9 గంటలలోపు 8.05 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.
కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…అక్టోబర్-28,2020న తొలి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ(నవంబర్-3) రెండో దశలో భాగంగా 94స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
https://10tv.in/madhya-bhopal-a-16-year-old-girl-beat-her-father-for-assaulting-her-mother-and-made-100-dials-to-surrender/
దేశ వ్యాప్తంగా మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7స్థానాలకు,ఒడిషాలోని 2స్థానాలకు,నాగాలాండ్ లోని 2స్థానాలకు,కర్ణాటకలోని 2స్థానాలకు,జార్ఖండ్ లోని 2స్థానాలకు,తెలంగాణలోని 1స్థానానికి,ఛత్తీస్ ఘడ్ లోని 1స్థానానికి,హర్యానాలోని 1స్థానానికి నేడు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
#WATCH Madhya Pradesh: A man carries his elderly mother in his arms to the polling booth in Gwalior to help her cast her vote in the by-election to the state assembly constituency.
Voting being held on 28 assembly seats of the state today. pic.twitter.com/E27e0BoChx
— ANI (@ANI) November 3, 2020