National Politics: రూ.12 కోట్ల విలువైన కారు వాడుతున్న మోదీ ఫకీర్ ఎలా అవుతాడు: శివసేన ఎంపీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇకపై తనను తాను ఫకీర్ గా, ప్రధాన సేవకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోవడం మానుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హితవు పలికారు

Sanjayraut
National Politics: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇకపై తనను తాను ఫకీర్ గా, ప్రధాన సేవకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోవడం మానుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హితవు పలికారు. ఇటీవల భద్రత దృష్ట్యా రూ.12 కోట్ల విలువైన బెంజ్ కారును ప్రధాని మోదీ కాన్వాయ్ లో చేర్చారు భద్రతాధికారులు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ రూ.12 కోట్లు విలువైన కారులో తిరిగే వ్యక్తి ఫకీర్ ఎలా అవుతాడంటూ సంజయ్ రౌత్ ఎద్దేవా చేసారు. శివసేన పత్రిక “సామ్నా”లో సంజయ్ రౌత్ ఒక వ్యాసాన్ని రాశారు. దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను వాడాలంటూ ప్రోత్సహిస్తున్న ప్రధాని.. తాను మాత్రం విదేశీ కారులో తిరుగుతున్నారని విమర్శించారు. మోదీ తెచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘స్టార్ట్-అప్ ఇండియా” వంటి స్వదేశీ నినాదాలు ప్రజలకే తప్ప ఆయనకు పట్టవా అంటూ సంజయ్ ప్రశ్నించారు.
Also read: Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ
ఈవిషయంలో దివంగత మాజీ ప్రధాన మంత్రులు నెహ్రు, ఇందిరా, రాజీవ్ గాంధీలను సంజయ్ రౌత్ ప్రస్తావించారు. దేశ విభజన అనంతరం ప్రమాదం పొంచివుందని తెలిసినా మాజీ ప్రధాని నెహ్రు, సాధారణ అంబాసిడర్ కారులోనే తిరిగారని పేర్కొన్నారు. ఆ కారు ఇండియాలో తయారు చేయబడిందని కూడా ప్రస్తావించారు. ఇక తన ఇద్దరు బాడీగార్డుల వలన ప్రాణహాని ఉందని తెలిసినా ఇందిరా గాంధీ.. వారినే వ్యక్తిగత సెక్యూరిటీగా కొనసాగించిందని, తమిళనాడులో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అయినా రాజీవ్ అక్కడకు వెళ్లి దారుణంగా చంపబడ్డారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆ నేతలు ప్రజలపై నమ్మకం ఉంచి పని చేశారన్న సంజయ్ రౌత్.. ప్రస్తుత ప్రధాని మోదీ సభలు, ర్యాలీల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు.
Also read: Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు