మధ్యప్రదేశ్ లో హనీట్రాప్…వేగవంతమైన సిట్ విచారణ

మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు.
రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, బిల్డర్లను టార్గెట్ చేసుకుని హనీట్రాప్ కు పాల్పడిన ఇండోర్ నగరానికి చెందిన ఐదుగురు మహిళలను, ఆ మహిళలో ఒకరి డ్రైవర్ ని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు,కంప్యూటర్లలో వేల సంఖ్యలో కాంగ్రెస్,బీజేపీ పార్టీల నాయకుల అభ్యంతకర వీడియోలు,చాటింగ్ లను కూడా పోలీసులు గుర్తించారు.
హనీ ట్రాప్ అంటే అందమైన అమ్మాయిలను ఎరగా వేయడం. సోషల్ మీడియా వేదికగా యువకులు, రాజకీయ నేతలు, ప్రముఖులను ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తారు. కొందరు డబ్బు దోచుకుంటారు, మరికొందరు ఉగ్రవాదులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంటారు. వీలైతే సైనిక రహస్యాలను తెలుసుకుని ఉగ్రవాదులకు చేరవేస్తుంటారు.